తెలంగాణ

ఫార్మాసిటీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా ముచ్చర్లలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న ఫార్మాసిటీకి కేంద్ర ప్రభుత్వం అనుమతి లభించింది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన డిపార్టుమెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రమోషన్ (డీఐపీ) ఫార్మాసిటీని నేషనల్ ఇనె్వస్ట్‌మెంట్ అండ్ మాన్యుఫాక్చర్ జోన్‌గా గుర్తించినట్టు రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం
ఇచ్చింది. రూ.16,395 కోట్ల వ్యయంతో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న ఫార్మాసిటీలో వౌలిక సదుపాయాల కల్పనకు కేంద్ర ప్రభుత్వాన్ని రూ. 6 వేల కోట్ల ఆర్థిక సహాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. అయితే ఈ మొత్తంలో మొదటి విడతలో రూ.1500 కోట్లు విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. ఫార్మాసిటీ ప్రతిపాదనకు 2016లోనే కేంద్ర ప్రభుత్వం సూచనప్రాయంగా అంగీకారం తెలిపినప్పటికీ టెక్నో-ఎకనామిక్ అర్హతలపై రాష్ట్రాన్ని సమగ్ర నివేదిక కోరింది. ఫార్మాసిటీ ప్రతిపాదనపై రాష్ట్ర ప్రభుత్వం అందజేసిన సమగ్ర నివేదికను డీఐపీ అధ్యయనం చేసిన అనంతరం గత నెల తుది అనుమతి ఇచ్చినట్టు పేర్కొంది. ఫార్మాసిటీలో 64 వేల కోట్ల పెట్టుబడులు వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. ఫార్మాసిటీలో 5.6 లక్షల మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి లభించనుందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. ఫార్మాసిటీ స్థాపన కోసం తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్‌పీవీ) ఏర్పాటు చేసింది. ఫార్మాసిటీలో వౌలిక సదుపాయాల కల్పనకు ఏషియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ సంస్థ నుంచి ఆర్థిక సహాయానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన పంపింది.