తెలంగాణ

పల్లెలకూ ఓ ప్రణాళిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 19: కొత్త జిల్లాలు, మండలాల ఏర్పాటు ప్రక్రియ ఊపందుకోవడంతో వీటిని అభివృద్ధి కేంద్రాలుగా తీర్చిదిద్దే చర్యలపై ప్రభుత్వం దృష్టిసారించింది. ప్రస్తుతం అమలులో ఉన్న టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ చట్టంలో సమూల మార్పులతో ముసాదాను సిద్ధం చేస్తోంది. టౌన్ ప్లానింగ్ తరహాలో విలేజి ప్లానింగ్ చట్టం-2016 (గ్రామ ప్రణాళిక చట్టం) రూపొందించడంలో పట్టణ ప్రణాళికశాఖ కసరత్తు మొదలు పెట్టింది. సెప్టెంబర్‌లో జరుగనున్న శాసనసభ వర్షాకాల సమావేశాల్లో ఈ చట్టానికి అమోదం పొందడమా? లేక ఆలోగా ఆర్డినెన్స్ తీసుకురావడమా? అనే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. పంచాయతీరాజ్‌శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కె తారకరామారావు కేరళ రాష్ట్రంలో పర్యటించి అక్కడ పట్టణాలు, గ్రామాల అభివృద్ధికి చేపడుతున్న కార్యక్రమాలపై అధ్యయనం చేశారు. ఆ రాష్ట్రంలో పట్టణాల అభివృద్ధి కోసమే కాకుండా గ్రామాల అభివృద్దికి కూడా ప్రత్యేక ప్రణాళిక చట్టం ఉన్న విషయం మంత్రి దృష్టికి వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో కూడా అలాంటి గ్రామ ప్రణాళిక చట్టం ఉండాలని మంత్రి భావించారు. ఇతర దక్షిణాది రాష్ట్రాలో అమలు చేస్తున్న ప్రణాళికలను అధ్యయనం చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఈ మేరకు కేరళ, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల్లో అమలు చేస్తున్న ప్రణాళికలను పట్టణ ప్రణాళిక శాఖ అధ్యయనం చేసింది. అలాంటి చట్టాన్ని రాష్ట్రంలో కూడా ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ యాక్ట్ తరహాలో రాష్ట్రంలో విలేజి ప్లానింగ్ యాక్ట్‌ను ప్రభుత్వం రూపొందిస్తుంది. విధిగా విలేజి ప్లానింగ్ యాక్ట్‌గా కాకుండా ప్రస్తుతం అమలులో ఉన్న టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ చట్టంలోనే విలేజి ప్లానింగ్‌ను చేర్చుతున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ యాక్ట్-1920 అమలులో ఉంది. రాష్ట్ర విభజన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చట్టాలనే తెలంగాణ ప్రభుత్వ అన్వయించుకుంటుంది. అయితే టౌన్ ప్లానింగ్ చట్టానే్న యధాతధంగా కొనసాగిస్తున్నారు. ఎలాగూ ఈ చట్టంలో సమూల మార్పులు తీసుకరానుండటంతో ఎపి టౌన్ ప్లానింగ్ యాక్ట్‌ను తెలంగాణ ప్రభుత్వం అన్వయించుకోలేదని అధికార వర్గాలు తెలిపాయి. కొత్త జిల్లాలతో పాటు కొత్త మండలాలు కూడా ఏర్పాటు కానున్న విషయం తెలిసిందే. కొన్ని మండల కేంద్రాలు నగర పంచాయతీలు, మున్సిపాల్టీలుగా ఉన్నాయి. అయితే చాలా మటుకు మండలాలు మేజర్ గ్రామ పంచాయతీలు, మేజర్ గ్రామ పంచాయతీలుగానే ఉన్నాయి. వీటిని అభివృద్ధి పర్చడానికి టౌన్ ప్లానింగ్ మాదిరిగా ప్రత్యేక చట్టం ఏది లేదు. దీంతో ప్రభుత్వం కొత్తగా రూపొందించబోయే చట్టంలో వీటిని కూడా అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక ప్రణాళికను ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. కొత్తగా ఏర్పాటు చేయబోయే జిల్లాలు, మండల కేంద్రాలు కేవలం పాలనపరమైన కేంద్రాలుగానే కాకుండా అభివృద్ధి కేంద్రాలుగా వీటిని తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ఇందులో భాగంగానే టౌన్ అండ్ విలేజి ప్లానింగ్ యాక్ట్-2106 రూపుదిద్దుకుంటోంది.