తెలంగాణ

యాదాద్రిలో వైకుంఠ ద్వార వైభవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాదగిరిగుట్ట, జనవరి 6: నిత్యం తన దర్శనం కోసం వచ్చే భక్తుడి కోసం భగవంతుడే కదిలివచ్చి ముక్కోటి ఏకాదశి రోజున వైకుంఠ ద్వార దర్శనమివ్వగా భక్తకోటి వైకుంఠ ద్వార దర్శనంతో పులకించింది. ఉషోదయపు మంచుతెరల మధ్య వైకుంఠ ద్వార దర్శనమిచ్చిన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారిని దర్శించుకున్న భక్తులు గోవింద నామస్మరణలతో తన్మయులయ్యారు. సోమవారం తెల్లవారుజామున ముక్కోటి ఏకాదశి రోజున లక్ష్మీనరసింహులను వైకుంఠ ద్వార దర్శనం చేసుకునేందుకు బ్రహ్మాది ముక్కోటి దేవతలు, సుర మునులు, భక్తులు తరలివచ్చి స్వామివారి దర్శన భాగ్యమున పులకించారు. మంచుతుంపర్ల మధ్య వేకువజామున 6:30 గంటలకు అర్చక బృందం శాస్తయ్రుక్త పూజల మధ్య యాదాద్రి బాల ఆలయం ఉత్తర ద్వార దర్శనం వద్ద తన కోసం వేంచేసి ఉన్న భక్త జనానికి లక్ష్మీనరసింహులు గరుడ వాహనరూఢుడై దర్శనమిచ్చి తరింపచేశారు. గరుడ వాహనంపై వైకుంఠ నాథుడిగా లక్ష్మీనరసింహుడిని అలంకరించి అమ్మవారిని, అళ్వారులను అలంకార సేవలతో విశేషమైన రీతిలో వైకుంఠ ద్వార దర్శన మహోత్సవం నిర్వహించారు. స్వామివారి వైకుంఠ ద్వార దర్శనంతో భక్తులెల్లరూ ఒక్కసారిగా చేసిన గోవింద నామస్మరణలతో యాదాద్రి కొండపరిసరాలు మారుమోగాయి.
'చిత్రం...లక్ష్మీనరసింహుడికి పూజలు నిర్వహిస్తున్న కలెక్టర్ అనిత