తెలంగాణ

సీఏఏపై కేసీఆర్ వైఖరి స్పష్టం చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్ టౌన్, జనవరి 6: పౌరసత్వ సవరణ చట్టం అమలును పార్లమెంటులో వ్యతిరేకించిన టీఆర్‌ఎస్ ఎంపీలు రాష్ట్రంలో కొనసాగుతున్న నిరసనలకు మద్దతు తెలపకపోవటం వెనుక ఆంతర్యమేంటని? సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ప్రశ్నించారు. సోమవారం నగరంలోని బద్ధం ఎల్లారెడ్డి భవన్‌లో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఏఏపై కేసీఆర్ తన వైఖరి స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. పౌరసత్వ చట్టంతో మతోన్మాదాన్ని పెంచి పోషించేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీ దేశంలోని ముస్లింలను భయభ్రాంతులకు గురి చేస్తోందని ఆరోపించారు. సీఏఏ చట్టసవరణకు మద్దతు తెలిపిన ఎన్‌డిఏ కూటమిలోని కొన్ని పార్టీలు ఆయా రాష్ట్రాల్లో అమలు చేసేందుకు సుముఖత వ్యక్తం చేయటం లేదని, ముస్లింలకు అన్యాయం జరుగుతుండటం నేపథ్యంలోనే తమ తమ రాష్ట్రాల్లో చట్టం అమలు చేసేందుకు నిరాసక్తత ప్రదర్శిస్తున్నారని అన్నారు. అసోంలో ఇప్పటికే 19 లక్షల మంది శరణార్థులకు భారత పౌరసత్వం ఇచ్చేందుకు దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని అన్నారు. ఇతర దేశాల నుంచి వలస వచ్చే శరణార్థులకు పౌరసత్వం ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్ పాలన అధ్వాన్నంగా మారిందని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు విస్మరించి తమ సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని విమర్శించారు.