తెలంగాణ

షెడ్యూల్ ప్రకారమే ‘పుర’పోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇటీవల ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వి. నాగిరెడ్డి స్పష్టం చేశారు. ఎన్నికల కమిషన్ కార్యాలయంలో మంగళవారం రాత్రి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, మంగళవారం సాయంత్రం హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను దృష్టిలో ఉంచుకుని తాజాగా ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేశామన్నారు. ఈ నోటిఫికేషన్‌లో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌ను తొలగించారు. ఇటీవల జారీ చేసిన షెడ్యూల్‌లో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఉండగా, ఇప్పుడు దీనిని తొలగించారు. అంటే తొమ్మిది మున్సిపల్ కార్పొరేషన్లు, 120 మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా నోటిఫికేషన్ జారీ అయింది. కరీంనగర్ పట్టణంలో ఓటర్ల జాబితాలో తప్పులు ఉన్నాయని హైకోర్టు గుర్తించిందని, అందుకే ఈ కార్పొరేషన్‌కు ఇప్పటికిప్పుడే నోటిఫికేషన్ ఇవ్వలేదని స్పష్టం చేశారు. ము న్సిపల్ శాఖను ఈ అంశంపై వివరణ కోరామని, మంగళవారం అర్ధరాత్రిలోగా సరైన సమాధానం వస్తే, కరీంనగర్ కార్పొరేషన్‌కు ప్రత్యేకంగా నోటిఫికేషన్ జారీ చేస్తామన్నారు. లేకపోతే తర్వాత తేదీ ప్రకటించి ఎన్నికలు నిర్వహిస్తామని నాగిరెడ్డి వివరించారు.
ఇలాఉండగా హైదరాబాద్ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) 13వ వార్డు (దబీర్‌పురా)కు కూడా
ఎన్నికలు నిర్వహిస్తున్నామని నాగిరెడ్డి తెలిపారు. ఈ నియోజకవ ర్గం ఖాళీగా ఉందన్నారు. రాష్ట్రంలోని మిగతా కార్పొరేషన్లు, మున్సిపాలిటీలతో పాటు దీనికి కూడా జనవరి 22న పోలింగ్ ఉంటుందన్నారు.
ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేసిన కార్పొరేషన్లు ఇవీ.. రామగుండం, బడంగ్‌పేట, మీర్‌పేట, బండ్లగూడ జాగీర్, బోడుప్పల్, పీర్జాదిగూడ, జవహర్‌నగర్, నిజాంపేట, నిజామాబాద్.
మంగళవారం రాత్రి జారీ చేసిన షెడ్యూల్ ఈ విధంగా ఉంది.
నోటిఫికేషన్ వివరాలు...
ఎన్నికల కార్యక్రమం ఎన్నికల షెడ్యూల్
నోటిఫికేషన్ జారీ జనవరి 7
రిటర్నింగ్ అధికారులు జారీ చేసే నోటీస్ 8వ తేదీ
నామినేషన్ల స్వీకరణ 8 ఉదయం 10.30 నుండి 5 వరకు
ఓటర్ల జాబితా వెల్లడి 8వ తేదీ
నామినేషన్ల చివరి తేదీ 10వ తేదీ సాయంత్రం 5 వరకు
నామినేషన్ల పరిశీలన 11వ తేదీ ఉదయం 11 గంటలకు
అప్పీల్‌కు అవకాశం 12వ తేదీ సాయంత్రం 5 వరకు
అప్పీళ్ల పరిష్కారం 13వ తేదీ సాయంత్రం 5 లోగా
నామినేషన్ల ఉపసంహరణ 14వ తేదీ మధ్యాహ్నం 3 వరకు
పోలింగ్ 22న
రీపోల్..అవసరమైతే 24న
ఓట్ల లెక్కింపు 25వ తేదీ ఉదయం 8 గంటల నుండి
ఫలితాల వెల్లడి లెక్కింపు పూర్తవగానే..