తెలంగాణ

కాంగ్రెస్ కామన్ మేనిఫెస్టో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 7: వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున కామన్ మేనిఫెస్టో తయారు చేయాలని నిర్ణయించినట్టు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. అయితే స్థానిక అంశాల వారీ విధిగా లోకల్ మేనిఫెస్టోను రూపొందించుకోవల్సిందిగా ఆయన పార్టీ నేతలను ఆదేశించారు. మున్సిపల్ ఎన్నికల వ్యూహరచనకు బుధవారం నాడు అన్ని మున్సిపాల్టీల్లో స్థానిక సమావేశాలను ఏర్పాటు చేసుకోవాలని ఆయన సూచించారు. గురువారంలోగా సెలక్ట్ ఎలక్ట్ పద్ధతిలో అభ్యర్థులను ఖరారు చేస్తామని అన్నారు. పార్టీ తరఫున పోటీ చేసేవారు 20 రూపాయిల బాండ్ పేపర్‌పై అఫిడవిట్ ఇవ్వాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ అఫిడవిట్‌లో పార్టీ నుండి గెలిచిన వారు ఇతర పార్టీలకు వెళ్లబోమని విధిగా పేర్కొనాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. ఈ నెల 11, 12 తేదీల్లో అభ్యర్ధులకు బీ ఫారంలను ఇస్తామని చెప్పారు. ప్రతి మున్సిపాల్టీలో సంబంధిత ఎమ్మెల్యేలు లేదా ఎన్నికల్లో పోటీ చేసిన ఎంపీ, ఎంఎల్‌ఏ అభ్యర్థి, డీసీసీ అధ్యక్షుడు , మున్సిపాల్టీ పరిధిలోని ముఖ్య నేతలు సమన్వయంగా అభ్యర్ధులను ఖరారు చేస్తారని తెలిపారు. ఎన్నికల ప్రచారం కోసం కొంతమంది స్టార్ క్యాంపెయినర్స్‌ను ఎంపిక చేయనున్నట్టు ఆయన తెలిపారు. ఇలా ఉండగా, గాంధీ భవన్‌లో మంగళవారం జరిగిన సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జీ ఆర్‌సీ కుంతియా, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీ నేతలతో మాట్లాడారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లోని మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని, పార్టీ కార్యకర్తలు, నేతలు సమన్వయంతో పనిచేయాలన్నారు. మేనిఫెస్టోలో ప్రజారోగ్య సమస్యలు, వౌలిక సదుపాయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామన్నారు. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీకి పరాభవం తప్పదని ఆయన హెచ్చరించారు. తమకు వివిధ జిల్లాల నుంచి వచ్చిన సమాచారం ప్రకారం టీఆర్‌ఎస్ ప్రభుత్వ పాలనతో ప్రజలు విసిగి ఉన్నారని, తీవ్ర అసంతృప్తి ఉన్నారన్నారు. తీవ్రమైన అస్తవ్యస్త పరిస్థితులు మున్సిపాలిటీల్లో నెలకొని ఉన్నాయన్నారు. పాలన స్తంభించిందన్నారు. కుటుంబ పాలనకు చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నేతలు విబేధాలను విస్మరించి సమిష్టిగా పనిచేయాలన్నారు. పారదర్శకంగా, జవాబుదారీతనంతో అభ్యర్థుల ఎంపిక ఉంటుందన్నారు. రాష్ట్రంలో బీజేపీ, ఎంఐఎం, టీఆర్‌ఎస్ పార్టీలకు చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ సమాయత్తమైందన్నారు. కేసీఆర్ ప్రజావ్యతిరేక పాలన విధానాలను జనంలోకి తీసుకెళ్లనున్నట్లు ఆయన చెప్పారు.
'చిత్రం...గాంధీభవన్‌లో సీనియర్ కాంగ్రెస్ నాయకులతో మంగళవారం సమావేశమైన
పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి కుంతియా, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్