తెలంగాణ

హామీలను నెరవేర్చడంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 7: ఎన్నికల సమయంలో కేసీఆర్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఘోరంగా విఫలమైందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విమర్శించారు. మంగళవారం నాడు ఎండీ మహ్మద్ అధ్యక్షతన సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన సమావేశంలో చాడ వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎన్నికల సమయంలో అర్హులైన పేదలకు డబుల్‌బెడ్ రూమ్స్ నిర్మించి ఇస్తామని, ఇంటికో ఉద్యోగం ఇస్తామని, కేజీ నుండి పీజీ వరకూ ఉచిత విద్య అందిస్తామని, నగరాలను అభివృద్ధి చేస్తామని, వౌలిక సదుపాయాలను కల్పిస్తామని అనేక వాగ్దానాలు చేసి ఎన్నికల్లో గెలిచి అధికారం చేపట్టిన తర్వాత వాటిని అమలుచేయడంలో ఘోరంగా విఫలమయ్యారని విమర్శించారు. రాష్ట్రంలో పాఠశాలలు, కళాశాలలు మూసి వేస్తున్నారని, అనేక సంక్షేమ కార్యక్రమాలను అటకెక్కించడంతో ప్రగతి పూర్తిగా నిలిచిపోయిందని విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ మినహా కలిసొచ్చే వామపక్ష, ప్రజాస్వామ్య, లౌకికపార్టీలతో కలిసి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చాడ వెంకటరెడ్డి స్పష్టం చేశారు. కార్యదర్శివర్గ సభ్యుడు బాలమల్లేష్ మాట్లాడుతూ రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కార్యకర్తలు సిద్ధం కావాలని అన్నారు.
12న వామపక్ష పార్టీల రాష్ట్ర సదస్సు
పౌరసత్వ సవరణ చట్టం, ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌లకు వ్యతిరేకంగా రాష్ట్రంలో దేశంలో జరుగుతున్న ఉద్యమాలపై వామపక్షాలు ఈ నెల 12న సదస్సు నిర్వహించాలని నిర్ణయించినట్టు సీపీఐఎంఎల్ న్యూడెముక్రసీ రాష్ట్ర నేత పోటు రంగారావు తెలిపారు. మంగళవారం నాడు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన వామపక్షాల సమావేశంలో ఈ మేరకు నిర్ణయించినట్టు చెప్పారు. ఈ నెల 5న జేఎన్‌యూలో విద్యార్థి నేతలపై , అధ్యాపకులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు. ఈ సంఘటనపై న్యాయవిచారణ జరిపించాలని అన్నారు.
పునరేకీకరణ విజయానికి సంకేతం
తెలంగాణ విద్యా, ఉపాధ్యాయ రంగంలో పనిచేస్తున్న మూడు ఉపాధ్యాయ సంఘాలు విడివిడిగా ఉంటూ పోరాటాలు ఉద్యమాలు చేసి హక్కులను సాధించుకోలేమని భావించి టీపీటీఎఫ్, టీటీఎఫ్, టీడీటీఎఫ్ సంఘాలు ఐక్యం కావడం హర్షణీయమని ఎఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ బాలరాజ్ పేర్కొన్నారు.