తెలంగాణ

నేడు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 7: కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 8న దేశ వ్యాప్త సమ్మెకు కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. కేంద్రం అనుసరిస్తున్న కార్మిక, ప్రజా, జాతి వ్యతిరేక విధానాలకు నిరసనగా నిర్వహించే ఈ సమ్మెలో దేశంలో 25 కోట్ల మంది పాల్గొంటారని ఐఎన్‌టీయూసీ, ఎఐటీయూసీ, సీఐటీయూ, టీయుసీసీ తదితర సంఘాలు పేర్కొన్నాయి. కార్మికుల డిమండ్లపై భరోసా ఇవ్వడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని, కేంద్ర వైఖరికి నిరసనగా 8న అఖిల భారత సమ్మే చేపట్టనున్నట్టు 10 కేంద్ర కార్మిక సంఘాలు పేర్కొన్నాయి. విద్యాసంస్థల్లో పెరిగిన ఫీజులు, విద్య వ్యాపారీకరణకు వ్యతిరేకంగా మరో 60 విద్యార్థి సంఘాలు , విశ్వవిద్యాలయాల సంఘాలు సైతం ఈ సమ్మెలో పాల్గొంటున్నాయి. ఈ సమ్మె కారణంగా పలు రకాల సేవలు నిలిచిపోనున్నాయి. ముఖ్యంగా బ్యాంకింగ్, రవాణా రంగాలపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో సమ్మెకు మద్దతు పలుకుతున్నట్టు వామపక్ష పార్టీలు, ట్రేడ్ యూనియన్ సంఘాలు ప్రకటించాయి. దేశవ్యాప్త సమ్మెకు మున్సిపల్ ఎన్నికల కోడ్ అడ్డంకి కాదని సీఐటీయూ అధ్యక్షుడు చుక్కరాములు, ప్రధానకార్యదర్శి ఎం సాయిబాబులు పేర్కొన్నారు. దేశవ్యాప్త సమ్మెకు స్థానిక మున్సిపల్ ఎన్నికల కోడ్ ఎలా అడ్డంకి అవుతుందని వారు ప్రశ్నించారు. మున్సిపల్ ఎన్నికల పేరుతో పోలీసులు అడ్డుకోవద్దని వారు పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా 200 సంఘాలు ఆధ్వర్యంలో జరిగే గ్రామీణ బంద్‌లో పాల్గొని బంద్‌ను జయప్రదం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం, ప్రజా సంఘాల ప్రతినిధులు కోరినట్టు సమన్వయ కమిటీ కార్యదర్శి టీ సాగర్ తెలిపారు.