తెలంగాణ

ఇంటర్ బోర్డులో ఆన్‌లైన్ నెట్‌వర్క్ ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 7: ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థకు సంబంధించి అన్ని రకాల సమస్యల పరిష్కారానికి వీలుగా ఇంటర్మీడియట్ విద్యా మండలి ఒక ఆన్‌లైన్ వ్యవస్థను సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సహకారంతో ఏర్పాటుచేసింది. ఈ వ్యవస్థను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్ మంగళవారం ఉదయం ప్రారంభించారు. ఈ వ్యవస్థ ద్వారా ఇంటర్ విద్యావ్యవస్థకు సంబంధించి అన్ని రకాల సమస్యలను, ఫిర్యాదులను సుదూర ప్రాంతాల నుండి ఆన్‌లైన్ వ్యవస్థ ద్వారా త్వరితగతిన పరిష్కరించుకోవచ్చని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్ పేర్కొన్నారు. ఈ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు ఇంటర్మీడియట్ విద్యామండలి ద్వారా సాంఘిక మాద్యమాలైన ఫేస్‌బుక్, ట్విట్టర్, వాట్సప్, జీమెయిల్, బీఐఈ వెబ్ సైట్, బీఐఈ కాల్ సెంటర్, బీఐఈ హెల్ప్‌డెస్క్‌లకు అనుసంథానించినట్టు పేర్కొన్నారు. ఈ వ్యవస్థలో ఫిర్యాదు నమోదుకాగానే ఫిర్యాదు చేసిన వ్యక్తి సెల్‌ఫోన్‌కు సమాచారం అందుతుందని, ఇంటర్మీడియట్ విద్యావ్యవస్థలోని అధికారులు నమోదైన ఫిర్యాదులను నిర్ణీత కాలవ్యవధిలో పరిష్కరిస్తారని అన్నారు. ఫిర్యాదుల పరిష్కరణ వివరాల స్థితిగతులను కూడా ఫిర్యాదుదారుడికి ఎప్పటికపుడు తెలియజేస్తారని అన్నారు. బీఐజీఆర్‌ఎస్ అప్లికేషన్ పేరుతో పిలిచే ఈ వ్యవస్థ బీఐజీఆర్‌ఎస్ డాట్ తెలంగాణ డాట్ జీవోవీ డాట్ ఇన్ పేరుతో ఉంటుందని ఫిర్యాదు దారుడు ఫోన్ నెంబర్‌ను తొలుత నమోదు చేయాలని, దానికి ఒక ఓటీపీ వస్తుందని, వెంటనే దానిని వాలిడేట్ చేసి ఫిర్యాదును నమోదు చేయాల్సి ఉంటుందని అధికారులు చెప్పారు. ఫిర్యాదు నమోదు చేసిన వెంటనే సబ్మిట్ బటన్ నొక్కాలని అపుడు నమోదవుతుందని వివరించారు.
ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ పరీక్షల నిర్వహణలో అన్ని జాగ్రత్తలనూ పాటించాలని పేర్కొన్నారు. పరీక్షల నిర్వహణలోనూ, జవాబుపత్రాల మూల్యాంకనంలోనూ ప్రత్యేక శ్రద్ధ వహించాలని చెప్పారు. గతంలో జరిగిన పొరపాట్లు పునరావృత్తం కాకుండా తగిన చర్యలు చేపట్టాలని అన్నారు. ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీ సూచనలను ఇంటర్ బోర్డు, ఎస్సెస్సీ బోర్డులు అధ్యయనం చేసి పూర్తి స్థాయిలో అమలుచేయడంతో పాటు పరీక్షలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించడానికి అదనపు చర్యలు కూడా తీసుకోవాలని అన్నారు.
జవాబుపత్రాలు దిద్దే ప్రతి ఒక్కరికీ పూర్తి స్థాయి శిక్షణ అందించి గత ఏడాది జరిగిన తప్పులపై అవగాహన కల్పించి, ఏ ఒక్క విద్యార్థీ నష్టపోకుండా చూడాలని ఆయన అధికారులకు సూచించారు. సమాధాన పత్రాలను దిద్దడంపై మంచి శిక్షణ కల్పించాలని, ప్రతి ఇవాల్యూయేటర్‌ను చైతన్య పరచాలని చెప్పారు. ఈ సమావేశంలో విద్యాశాఖ కార్యదర్శి బీ జనార్ధనరెడ్డి, ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్, బోర్డు సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
'చిత్రం...సమావేశంలో మాట్లాడుతున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్, విద్యాశాఖ కార్యదర్శి జనార్ధనరెడ్డి, ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్