తెలంగాణ

ఇద్దరు అధికారుల సస్పెన్షన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తకోట, జనవరి 7: సంకిరెడ్డిపల్లి గ్రామం అపరిశుభ్రంగా ఉండడం పట్ల కలెక్టర్ శే్వతామహంతి అసహనం వ్యక్తం చేశారు. మంగళవారం పల్లెప్రగతిలో భాగంగా మండలంలోని ఈదులబాయితాండాను పరిశీలించారు. అక్కడ మిషన్ భగీరథ ద్వారా అందిస్తున్న మంచినీటి సరఫరాపై సర్పంచును అడిగి తెలుసుకున్నారు. అనంతరం పాఠశాలకు వెళ్లి ఆమె తనిఖీ చేశారు. పాఠశాలకు కంపోండ్ వాల్ అవసరం ఉండగా గతంలో పట్టదారు భూమి ఉందని గిరిజనులు అభ్యంతరం తెలుపగా ప్రభుత్వం సర్వే నిర్వహించి పాఠశాలకు కంపోండ్‌వాల్‌ను మంజూరు చేస్తున్నట్లు ఉపాధ్యాయులు తెలిపారు. అనంతరం సంకిరెడ్డిపల్లి గ్రామానికి వెళ్లగా అక్కడ ఇంకుడుగుంతలు, మరుగుదొడ్ల నిర్మాణాలను పరిశీలించారు. కాగా ఓ ఇంటి సమీపంలో పెంట గుంత ఉండడంతో వెంటనే సర్పంచు శివరాములును అడిగి తెలుసుకున్నారు. గతంలో ఆ యాజమానికి ఎన్నిసార్లు తెలిపిన స్పందించడం లేదని కాగా గ్రామ కార్యదర్శి సుదర్శన్‌రెడ్డి నోటీసులు ఎందుకు జారీ చేయలేదని ప్రశ్నించారు. అందుకు సుదర్శన్‌రెడ్డి సదామానం చెప్పలేకపోయారు. ఆ గ్రామ ప్రత్యేక అధికారి గఫూర్ విధులకు గైర్హాజరు కావడం, పంచాయతి కార్యదర్శి సుదర్శన్‌రెడ్డి రెవిన్యూ ప్లాంటేషన్‌తో పాటు గ్రామంలో ఎక్కడ చూసిన పారిశుధ్య లోపం అపరిశుభ్రంగా ఉండడంతో ఆగ్రహించిన కలెక్టర్ ఇద్దరిని సస్పెండ్ చేయాలని డీపీ ఓను ఆదేశించారు. అనంతరం అమడబాకుల గ్రామానికి వెళ్లి ప్లాంటేషన్, ఇంకుడుగుంతల నిర్మాణం, మరుగుదొడ్ల నిర్మాణాలు బేష్‌గా ఉన్నాయని సర్పంచు బుచ్చన్నను అభినందించారు. ఆ గ్రామంలో పాఠశాల ప్రహారీ నిర్మాణం, స్మశాన వాటికను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. సంకిరెడ్డిపల్లి గ్రామాన్ని కూడా ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు స్థానిక ప్రజాప్రతినిధులు కృషి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. అమడబాకుల గ్రామం ఆదర్శ గ్రామంగా ఉండడం పట్ల ఆ గ్రామ ప్రజాప్రతినిధులను ఆమె అభినందించారు. కలెక్టర్ వెంట డీపీఓ రాజేశ్వరి, డీఆర్‌డీఎ పిడి గణేష్, జిల్లా పరిషత్ వైస్ ఛైర్మన్ వామన్‌గౌడ్, ఎంపిటిసి శేషిరెడ్డి, ఎంపిడి ఓ కతలప్ప, తహశీల్ధార్ రమేష్‌రెడ్డి ఉన్నారు.