తెలంగాణ

‘పుర’పోరుకు తొలిరోజు 947 నామినేషన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 8: రాష్ట్ర ఎన్నికల కమిషన్ జారీ చేసిన షెడ్యూల్ ప్రకారమే రాష్ట్రంలోని 9 మున్సిపల్ కార్పొరేషన్లు, 120 మున్సిపాలిటీల్లో రిటర్నింగ్ అధికారులు బుధవారం ఎన్నికల ‘నోటీస్’ జారీ చేశారు. ఉదయం 10.30 గంటలకు నోటీస్ జారీ చేసిన వెంటనే నామినేషన్ల పర్వం ప్రారంభమైంది. తొలిరోజు సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల
పత్రాలను స్వీకరించారు. తొలిరోజు 967 నామినేషన్లు దాఖలైనట్టు ఎన్నికల కమిషన్ ప్రకటించింది.
ఇలాఉండగా ఈ ఎన్నికల్లో వివిధ పార్టీల తరఫున ప్రచారం చేసేందుకు వచ్చే ‘స్టార్ క్యాంపెయినర్ల’ విషయంలో ఎన్నికల కమిషనర్ వి. నాగిరెడ్డి బుధవారం నోటిఫికేషన్ జారీ చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ వద్ద రిజిస్టర్ అయిన రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీల తరఫున ఒక్కొక్క పార్టీ నుంచి 20 మందికి అనుమతి ఇస్తామన్నారు. అలాగే కమిషన్ వద్ద రిజిస్టర్ అయిన అన్-రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీల తరఫున ఐదుగురు స్టార్ క్యాంపెయినర్లకు అనుమతి ఇస్తామన్నారు. రాజకీయ పార్టీలు ముందుగానే ఎన్నికల కమిషన్ నుండి స్టార్ క్యాంపెయినర్ల ప్రచారం కోసం అనుమతి తీసుకోవాలని నాగిరెడ్డి సూచించారు. బహిరంగ సభలు, ర్యాలీలు తదితర ప్రచార విధానాలకు విధించిన నియమావళిని నోటిఫికేషన్‌లో వెల్లడించారు. ఈ నియమావళిని పోటీ చేసే అభ్యర్థులు, రాజకీయ పార్టీలు అమలు చేయాలని నాగిరెడ్డి సూచించారు.

'చిత్రం... భువనగిరి మున్సిపాలిటీకి బుధవారం నామినేషన్ పత్రాన్ని దాఖలు చేస్తున్న బీజేపీ మహిళా అభ్యర్థి