తెలంగాణ

సిఎం కెసిఆర్ ఓ గాడ్సే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గద్వాల, జూలై 19: తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు గాడ్సేగా తయారయ్యారని, నడిగడ్డ ప్రజల ఆకాంక్షల సాధన కోసం మహబూబ్‌నగర్ జిల్లా గద్వాల జిల్లా ఏర్పాటే లక్ష్యంగా జములమ్మ ఆశీర్వాదంతో జయకేతనం ఎగురవేద్దామని ఎమ్మెల్యే డికె అరుణ, అలంపూర్ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ అన్నారు. మంగళవారం జములమ్మ ఆలయంలో పూజలు నిర్వహించి పాదయాత్రకు వారు బయలుదేరారు. ఈ సందర్భంగా పలు గ్రామాల్లో ఎమ్మెల్యేలు అరుణ, సంపత్‌కుమార్‌ల పాదయాత్రకు మహిళలు, ప్రజలు తరలివచ్చి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారినుద్దేశించి ఎమ్మెల్యేలు మాట్లాడుతూ జిల్లా కోసం గల్లీ నుంచి ఢిల్లీదాక జైత్రయాత్ర కొనసాగించి గద్వాలను జిల్లాగా ప్రకటించుకుందామని అన్నారు. రాష్ట్రంలో కెసిఆర్ గాంధీ కాదని, ఒక మతోన్మాదిగా గాడ్సే రూపంలో ఈ రాష్ట్రానికి శనిగా దాపురించారని వారు మండిపడ్డారు. న్యాయబద్ధంగా పోరాడుతున్న ఈ ఉద్యమంలో ప్రాణాలు సైతం అర్పించేందుకు సిద్ధంగా ఉన్నామని వారు స్పష్టం చేశారు. రాష్ట్ర మంత్రులు జిల్లాల పునర్విభజనలో కెసిఆర్ చంకన చేరి చెమ్మచెక్కలాటలాడుతున్నారని ఘాటుగా విమర్శించారు. పదవులు శాశ్వతం కాదు.. భావితరాల కోసం ఈ ఉద్యమం చేపట్టి సంవత్సరం కాలపరిమితి అవుతున్నా ప్రభుత్వంలో చలనం లేదని హెచ్చరించారు. నలుగురు నాలుగు విభాగాలుగా విభజించుకొని కేకులు కట్ చేసినట్లుగా రాష్ట్రంలో జిల్లాలను విభజిస్తున్నారని వారు వ్యాఖ్యానించారు. నడిగడ్డలో జరుగుతున్న అక్రమ వ్యాపారాలు, కల్లు, కాంట్రాక్టులు, ఇసుక, రేషన్ బియ్యం, మద్యం, ప్రభుత్వ స్థలాల కబ్జా తదితర దందాల్లో సిఎం కొడుకు ప్రమేయంతోనే నడుస్తున్నాయని వారు ఆరోపించారు. ఒక్క కెటిఆర్‌శాఖకే కోట్ల రూపాయల నిధులను విడుదల చేసి మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, వాటర్‌గ్రిడ్ పథకాలలో కమీషన్లు లేనిదే నిధులు మంజూరు చేయడం లేదని వారు ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కెసిఆర్ ఎర్రవల్లి గ్రామానికే సర్పంచ్‌గా ఉన్నారని, రాష్ట్రానికి మాత్రం సిఎంగా కొనసాగే అర్హతలేదని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రజలు అడుగుతున్న గద్వాల జిల్లా చేయాలని డిమాండ్‌ను ఆమోదపర్చాలని హెచ్చరించారు. ఎన్నికల సందర్భంగా ప్రజలకిచ్చిన హామీలను విస్మరించిన రాష్ట్ర ప్రభుత్వానికి పాలించే అర్హత లేదని, కుటుంబంలో నలుగురు పదవులను అనుభవిస్తూ రాష్ట్రాన్ని దోచుకుతింటున్నారని ఎమ్మెల్యే సంపత్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు.
వర్షంలోనూ సాగిన పాదయాత్ర...
గద్వాల జిల్లా కోసం మొదటిరోజు చేపట్టిన యాత్ర మధ్యాహ్న భోజన అనంతరం అనంతపురం మీదుగా ఎర్రవల్లికి కొనసాగింది. సాయంత్రం 4 గంటల సమయంలో వర్షం రావడంతో వర్షంలో కూడ ఎమ్మెల్యేలు డికె అరుణ, సంపత్‌కుమార్ పాదయాత్రను కొనసాగించారు. జిల్లా ఆకాంక్ష ముందు ఎంతటి ఆటుపోట్లనైనా ఎదుర్కొంటామని, ప్రజల కోసం ఎంతటి త్యాగాలకోసమైనా సిద్ధమంటూ యాత్రను కొనసాగించారు. గద్వాల జిల్లా సాధన కోసం ఎమ్మెల్యే డికె అరుణ, సంపత్‌కుమార్ చేపట్టిన పాదయాత్ర సందర్భంగా నడిగడ్డ కాంగ్రెస్‌లో నూతనోత్సాహం కనిపించింది. కేవలం కార్యకర్తలకు మాత్రమే పిలుపునివ్వడంతో మొదటిరోజు నడిగడ్డ నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో మహిళలు, యువకులు, సీనియర్ నాయకులు కదిలివచ్చి యాత్రకు కొత్తశోభను తీసుకవచ్చారు. ఎమ్మెల్యే డికె అరుణ చేపట్టిన యాత్రకు పెద్దసంఖ్యలో కార్యకర్తలు తరలిరావడం పట్ల ప్రతిపక్షాలకు దడపుట్టించింది. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ప్రకటించినప్పటికీ తెలంగాణలో కాంగ్రెస్‌కు ఆశించిన సీట్లు రాకపోవడంతో ప్రభుత్వం కైవసం చేసుకోలేదు. ప్రతిపక్ష పాత్రను పోషించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించిన కొందరు గులాబీ కండువాలు కప్పుకొని పార్టీకి అన్యాయం చేశా రన్నారు. అయినప్పటికీ కార్యకర్తలు రెండేళ్ల పాటు స్తబ్దుగా ఉండి పాదయాత్రలో భారీగా తరలివచ్చారు. ఎమ్మెల్యేలు సైతం కార్యకర్తల ఉత్సాహాన్ని రెట్టింపుచేసే విధంగా వారితో కలిసి యాత్రను కొనసాగించారు.

కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షలో ల
అభ్యర్థి ఆకస్మిక మృతి
కుటుంబంలో విషాదం
ఆంధ్రభూమి బ్యూరో
నల్లగొండ, జూలై 19: కానిస్టేబుల్ ఉద్యోగ సాధన పరీక్షలో పోటీ పడే ప్రయత్నంలో ఓ నిరుద్యోగి ఏకంగా జీవన పరుగుపోరులో ఓడి తనువు చాలించాడు. ఈ విషాద ఘటన నల్లగొండ పోలీస్ శాఖ నిర్వహించిన కానిస్టేబుల్ ఉద్యోగ దేహదారుఢ్య పరీక్షల్లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... పెన్‌పహాడ్ మండలం చెట్ల ముకుందాపురం గ్రామానికి చెందిన వాస రాజశేఖర్ (21) సోమవారం నల్లగొండ మేకల అభినవ్ స్టేడియంలో నిర్వహించిన కానిస్టేబుల్ ఉద్యోగ దేహదారుఢ్య పరీక్షలకు హాజరయ్యాడు. 800 మీటర్ల పరుగు పందెంలో రాజశేఖర్ రెండో రౌండ్‌లో పరుగు తీస్తుండగా అకస్మాత్తుగా కుప్పకూలాడు. వెంటనే పోలీసులు అతడికి ప్రాథమిక చికిత్స అందించి నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతునే మంగళవారం తెల్లవారుజామున 2 గంటలకు రాజశేఖర్ ప్రాణాలు కోల్పోయాడు. వాంతులు, రక్తవిరేచనాలతో పరిస్థితి విషమించి రాజశేఖర్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. రాజశేఖర్ ఆకస్మిక మరణం అతని తల్లిదండ్రులను, కుటుంబ సభ్యులను తీవ్ర విషాదానికి గురి చేసింది. రాజశేఖర్ తల్లిదండ్రులైన అంజయ్య, వెంకటమ్మతో పాటు అన్న శివకృష్ణ రోజుకూలీ పనిచేసుకుని జీవిస్తున్నారు. డిగ్రీ మూడో సంవత్సరం చదువుతున్న రాజశేఖర్ కానిస్టేబుల్ ఉద్యోగం సాధించి కుటుంబానికి ఆసరా అవుతాడనుకుంటే ఉద్యోగ ప్రయత్నంలోనే చనిపోవడంతో కుటుంబానికి పెద్దదిక్కు కోల్పోయినట్లయిందని తల్లిదండ్రులు వాపోయారు. కాగా, పేద దళిత కుటుంబానికి చెందిన రాజశేఖర్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆర్ధిక సహాయం అందించి ఆదుకోవాలని డివైఎఫ్‌ఐ జిల్లా కమిటీ కార్యదర్శి జె.నరసింహరావు డిమాండ్ చేశారు.
కోదండరాం
అధ్యయన యాత్ర
పాలమూరు జిల్లాలో
టిజెఎసి ప్రాజెక్టుల అధ్యయన యాత్ర
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జూలై 19: తెలంగాణ జెఎసి ఆధ్వర్యంలో ఈనెల 21, 22 తేదీల్లో మహబూబ్‌నగర్ జిల్లా సాగునీటి ప్రాజెక్టుల అధ్యయన యాత్ర చేపట్టనున్నారు. గురువారం ఉదయం ఆరుగంటలకు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్‌పార్క్ నుండి బయలుదేరుతారు. టిజెఎసి చైర్మన్ కోదండరామ్ ఇతర నాయకులు ఈ యాత్రలో పాల్గోంటారు. కొడంగల్‌లో నియోజక వర్గంలోని పెద్ద చెరువును సందర్శించి అనంతరం దామరగిద్ద వద్ద రైతులతో మాట్లాడి ప్రాజెక్టులపై అభిప్రాయాలు సేకరిస్తారు. శుక్రవారం ఉదయం ఎనిమిది గంటలకు ఎల్లూరు రిజర్వాయర్‌ను, ప్రతిపాదిత నార్లాపూర్ రిజర్వాయర్‌ను పరిశీలిస్తారు. సాయంత్రం ఐదు గంటలకు ఉధంపూర్ రిజర్వాయర్ స్థలాన్ని పరిశీలించి ముంపు గ్రామాల రైతులతో మాట్లాడి వివరాలు సేకరిస్తారు.

కల్లు గీసిన ఎక్సయజ్ మంత్రి
ధన్వాడ, జూలై 19: ఆయనో ఎక్సయజ్ మంత్రి. అయతేనేం...రాష్ట్రానికే మంత్రి నన్న విషయాన్ని మరిచిపోయ ఏకంగా ఈతచెట్టు ఎక్కారు. ఓస్...అంతేనా అనుకో కండి. ముచ్చటపడి కల్లు సైతం గీశారు. ఈ సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా ధన్వాడ మండల కేంద్రంలో మంగళవారం జరిగింది. మండల కేంద్రంలో గీత కార్మికుల ఆధ్వర్యంలో నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో మంత్రులు పద్మారావు, జూపల్లి కృష్ణారావు, నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి తదితరులు పాల్గొని ఈత మొక్కలను నాటారు. అనంతరం మంత్రి టి.పద్మారావుగౌడ్, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ ఈత చెట్టు పైకి ఎక్కి కల్లు గీసి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తారు.