తెలంగాణ

మేథో హక్కులపై తెలంగాణ సీఐఐ ఫెసిలిటేషన్ సెల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 8: తెలంగాణ ప్రభుత్వ సహకారంతో మేధో హక్కులపై పెసిలిటేషనద్ సెల్‌ను ఏర్పాటు చేసినట్లు భారతీయ పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) ప్రకటించింది. మేధోహక్కులపై ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు, ఇన్నోవేటర్లకు అవగాహన కల్పించేందుకు, సమాచారాన్ని అందించేందుకు ఈ సెల్‌ను ఏర్పాటు చేసినట్లు సీఐఐ తెలంగాణ చైర్మన్ డీ రాజు చెప్పారు. ఇనె్వంటర్లు, చిన్న, మధ్య తరహా పారిశ్రామికవేత్తలు, అకడమీషియన్లు, స్టార్టప్‌లు మేధో హక్కుల కోసం దరఖాస్తు చేసుకోవడం తదితర అంశాలపై మార్గదర్శకాలను తెలియచేస్తామన్నారు. పెటెంట్ హక్కులపై సమగ్రమైన అవగాహన కల్పిస్తామన్నారు. దీని వల్ల పారిశ్రామికవేత్తలకు ప్రయోజనం కలుగుతుందన్నారు. ఈ సెల్‌లో మేథోహక్కులనిపుణులు, ఐపీఆర్ అటార్నీలు, ఐపీఆర్ కౌనె్సలింగ్, గైడెన్స్ నిపుణులు ఉంటారని చెప్పారు.