తెలంగాణ

ఎన్ని అడ్డంకులు సృష్టించినా.. మున్సిపాలిటీల్లో గెలుపు మాదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మిర్యాలగూడ టౌన్, జనవరి 8: మునిసిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవకుండా అధికార పార్టీ అడ్డంకులు సృష్టిస్తూ దొడ్డిదారులు తొక్కుతోందని, అయనా కాంగ్రెస్ గెలవడం ఖాయమని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. బుధవారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని ఎన్‌వీఆర్ ఫంక్షన్‌హాలులో ప్రముఖ రవాణా రంగ యజమాని బత్తుల లక్ష్మారెడ్డి (బీఎల్‌ఆర్) బ్రదర్స్ సహచరులు వందలాది మంది టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్, మాజీ మంత్రి కే.జానారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ వార్డుల రిజర్వేషన్‌లు చేయకుండానే నోటిఫికేషన్ జారీ, ఓటర్ల జాబితా సరి చేయకుండానే వారికి అనుకూలంగా మల్చుకుని ఎన్నికలను టీఆర్‌ఎస్ నిర్వహిస్తున్నదని ఆరోపించారు. అయినా వాటిని తట్టుకుని కాంగ్రెస్ రాష్ట్రంలో మెజారిటీ మునిసిపాలిటీలను కైవసం చేసుకుంటుందన్నారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదన్నారు. తాను హౌసింగ్ మంత్రిగా ఉన్న కాలంలో కట్టిన ఇందిరమ్మ ఇళ్లు తప్ప డబుల్‌బెడ్ రూంలు లేనే లేవన్నారు. మిర్యాలగూడ మునిసిపల్ ఎన్నికల్లో మాజీ మంత్రి జానారెడ్డి, టీపీసీసీ కార్యదర్శి అలుగుబెల్లి అమరేందర్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు కే.శంకర్‌నాయక్‌లు కలిసి 48 వార్డులను గెలిపిస్తారని ఆయన పేర్కొన్నారు.
'చిత్రం... సమావేశంలో మాట్లాడుతున్న పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి