తెలంగాణ

కృష్ణమ్మ ఉరకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, జూలై 20: కర్ణాటక నుంచి వస్తున్న కృష్ణా వరద ఎట్టకేలకు రాష్ట్రాన్ని తాకింది. బుధవారం జూరాల ప్రాజెక్టులో కృష్ణమ్మ పరవళ్లు కనిపించాయి. అల్మట్టి, నారాయణపూర్ డ్యాంల ద్వారా విడుదల చేసిన వరద నీరు రాష్ట్రంలోకి అడుగుపెట్టడంతో జూరాల ప్రాజెక్టు నిండుతోంది. జూరాల ప్రాజెక్టుకు వరద చేరిందన్న సమాచారంతో తెలంగాణ ప్రభుత్వం ఎడమ కాల్వకు నీటిని విడుదల చేసింది. 800 క్యూసెక్కుల నీటిని బీమా ప్రాజెక్టు ఫేజ్-1లోకి వదిలారు. కుడి కాల్వకు 300 క్యూసెక్కుల జలాలను విడిచిపెట్టారు. ఈ జలాలతో సంకరసముద్రం రిజర్వాయర్ నింపుతున్నారు. జూరాల ప్రాజెక్టుకు నారాయణపూర్ ప్రాజెక్టు నుండి ఆరు వేల క్యూసెక్కుల వరద నీరు వస్తుంది. అల్మట్టికి 45873 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుండటంతో విద్యుదుత్పత్తికి వదులుతున్న 15వేల క్యూసెక్కుల నీరు ఆల్మట్టి నుండి వదిలినప్పటికీ, ఈ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నారాయణపూర్ డ్యాంలోకి 57022 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. జూరాల ప్రాజెక్టు సామర్థ్యం 11.9 టిఎంసికి గాను ప్రస్తుతం 7 టిఎంసికి పైగా నీటి నిల్వ ఉంది. గత రెండు రోజులగా నారాయణపూర్ నుండి వదిలిన నీటితోపాటు ప్రస్తుతం వదులుతున్న వరద నీటిని దృష్టిలో ఉంచుకుని మహబూబ్‌నగర్ జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులకు నీటిని విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేశారు. పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించిన కొన్ని పంప్‌లు పూర్తికావడంతో వాటి ద్వారా ఆయకట్టు రైతాంగానికి సాగునీరు ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా నేడు నెట్టెంపాడు, బీమా పేజ్-1, కోయిల్‌సాగర్ ప్రాజెక్టుల పంప్‌ల ద్వారా నీటిని విడుదల చేసి ప్రారంభించేందుకు రాష్ట్ర భారీ నీటిపారుదల మంత్రి హరిశీరావు వస్తున్నారు. జూరాల నుండి బీమా ప్రాజెక్టుకు ఇప్పటికే 800 క్యూసెక్కుల నీటిని విడుదల చేయగా, జూరాల బ్యాక్ వాటర్ నుండే మరో 700 క్యూసెక్కుల వరద నీటిని మళ్లించుకుని నెట్టెంపాడు పంప్‌లను ప్రారంభించనున్నారు. అదేవిధంగా కోయిల్‌సాగర్ ప్రాజెక్టులోకి సైతం జూరాల బ్యాక్ వాటర్‌ను దాదాపు 1000 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోయనున్నారు. ఎత్తిపోసే పంప్‌లను మంత్రి హరీశ్‌రావు ప్రారంభిస్తారు. ఒకేరోజు మూడు పెండింగ్ ప్రాజెక్టుల ద్వారా పంప్‌లను ప్రారంభించి ఈ ఖరీఫ్‌లోనే దాదాపు 4.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని అధికారులు ముమ్మర ప్రయత్నాలు మొదలుపెట్టారు. ప్రభుత్వం అనుకున్న లక్ష్యానికి ఈ ఖరీఫ్‌లోనే సాగునీరు అందిస్తుండటంతో మహబూబ్‌నగర్ జిల్లా రైతాంగం ఖరీఫ్‌పై పెట్టుకున్న ఆశలు చిగురిస్తున్నాయి. కాగా ఆల్మట్టి నుంచి 15000 క్యూసెక్కుల నీరు విడుదల చేసినప్పటికీ, నారాయణపూర్ ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు నారాయణపూర్ డ్యాంలోకి దాదాపు 57022 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. నారాయణపూర్ ప్రాజెక్టుకు వచ్చే వరదతోపాటు మరో రెండు రోజుల పాటు జూరాల ప్రాజెక్టు ఇలాగే వరద ప్రవాహం ఉంటే జూరాల ప్రాజెక్టు గేట్లు ఎత్తివేసి శ్రీశైలం ప్రాజెక్టులోకి నీటిని విడుదల చేయనున్నారు.
chitram...
జూరాల ఎగువన రైల్వే బ్రిడ్జి కింద నిండుకుండలా పారుతున్న కృష్ణా నది