తెలంగాణ

‘డబుల్’ ట్రబుల్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 20: డబుల్ బెడ్‌రూమ్.. పేదవాడు సొంతిట్లో పూర్తి ఆత్మగౌరవంతో బతకాలన్న లక్ష్యం. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రూపొందించిన మానవీయ పథకమిది. ఇందిరమ్మ ఇళ్ము, ఎన్టీఆర్ గృహ నిర్మాణాలకు పూర్త్భిన్నంగా సామాన్యుడు ధీమాగా బతికేందుకు కేసీఆర్ సొంత ఆలోచనల నుంచి పుట్టిన బృహత్తర పథకమిది. అయితే అధికారుల నత్తనడక విధానాల వల్ల సందేహాలపాలవుతోంది. దేశానికి రోల్‌మోడల్‌గా నిలిచిన సనత్‌నగర్ నియోజకవర్గంలోని ఐడిహెచ్ కాలనీలో 396 డబుల్‌బెడ్ రూములతో చరిత్ర సృష్టించిన కేసీఆర్ ప్రభుత్వం, అదే పథకాన్ని రాష్టవ్య్రాప్తంగా వర్తింపచేస్తామని ప్రకటించింది. అందులో భాగంగా, ఈ ఏడాదికి 2లక్షల 7వేల డబుల్ బెడ్‌రూములు నిర్మించి ఇస్తామని కేసీఆర్ ప్రకటించారు. ఇందుకు రూ. 14వేల కోట్లు అవసరమని అంచనా వేశారు. హడ్కో నుంచి రుణం కోసం ప్రభుత్వం చేసిన ప్రయత్నం ఫలించి, రూ.12వేల కోట్లు రుణంగా ఇచ్చేందుకు అంగీకరించింది. నిరుడు ఇచ్చిన 4వేల కోట్లను వినియోగించి ఉంటే, ఈపాటికి కొన్ని జిల్లాల్లోనయినా డబుల్‌బెడ్ రూములు పూర్యయ్యేవి.
అయితే ఈ పథకం అమలును అనుభవం ఉన్న హౌసింగ్ శాఖకు కాకుండా, రెవిన్యూ, ఆర్ అండ్ బికి ఇవ్వడం వల్ల ఈ పథకం ఇప్పటివరకూ పూర్తికాకపోవడానికి కారణమని తెరాస నేతలే విశే్లషిస్తున్నారు. ఐడిహెచ్ కాలనీ మోడల్‌కు వచ్చిన ప్రచారంతో ప్రతి జిల్లాలో లక్షల సంఖ్యలో దరఖాస్తులు రావడం కూడా సమస్యగా పరిణమించింది. ఈ ఏడాది 2లక్షల 7 వేల ఇళ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ, ఇప్పటివరకూ 6,488 మాత్రమే నిర్మాణమయ్యాయి. కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడం, వారిని ఒప్పించడంలో అధికారుల వైఫల్యం కూడా దీనికి ప్రధాన కారణం. ప్రభుత్వం చదరపు అడుగుకు రూ.900గా నిర్ణయిస్తే, రూ.1100 ఇస్తేగానీ పనులు చేయడం కష్టమని కాంట్రాక్టర్లు బీష్మిస్తున్నారు. దీనితో పనుల్లో జాప్యం జరుగుతోంది. విపక్షాలు దీనిని అవకాశంగా తీసుకుని విమర్శనాస్త్రాలు సంధిస్తుండటం తెరాసకు కూడా ఇబ్బందికరంగా పరిణమించింది. 5 జిల్లాల్లో ఇప్పటివరకూ ఒక్క టెండరు కూడా రాకపోవడం ఆందోళన కలిగిస్తోంది.
ఇళ్ల ఇక్కట్లు ఇవీ..
*కేసీఆర్ సొంత జిల్లా మెదక్‌లో12,100 మంజూరు చేయగా, 10,075 ఇళ్లు అనుమతించారు. ఆయన దత్తత తీసుకున్న జగదేవ్‌పూర్ మండలం ఎర్రవల్లి, నర్సంపేటలో నిర్మించతలపెట్టిన ఇళ్లను మేనెలాఖరుకు పూర్తి చేసి, సామూహిక గృహప్రవేశాలు నిర్వహిస్తామన్న కేసీఆర్ హామీ అసంపూర్తిగానే మిగిలింది.
* నిజామాబాద్‌లో కేటాయించిన 7315 ఇళ్ల నిర్మాణాలకు ఒక్కరూ టెండరు వేయలేదు. ఎమ్మెల్యేలంతా గత దసరానాడు శంకుస్థాపనలు చేశారు. మంత్రి పోచారం సొంత నియోజకవర్గం బాన్సువాడలో వంద ఇళ్లకు శంకుస్థాపన చేసినా పనులు మాత్రం ప్రారంభం కాలేదు.
* వరంగల్‌లో 9882 మంజూరు కాగా, 1382 ఇళ్లకు గ్రౌండ్‌లెవల్ పూర్తయ్యాయి. స్పీకర్ నియోజకవర్గమైన భూపాలపల్లికి 2700, దయాకర్ నియోజకవర్గానికి వెయ్యి ఇళ్లు మంజూరయినా పనులు ప్రారంభం కాలేదు. సీఎం కేసీఆర్ గతేడాది జనవరిలో నగరంలో నాలుగురోజులు తిష్టవేసి, 4 వేల ఇళ్లను నాలుగునెలల్లో పూర్తి చేసి, అందరితో గృహప్రవేశాలు చేయిస్తామని ప్రకటించినా గ్రౌండ్‌లెవల్ పూర్తయినవి 1382మాత్రమే.
* కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తోన్న కరీంనగర్ జిల్లాకు 6947 ఇళ్లు మంజూరు కాగా, కేసీఆర్ దత్తత తీసుకున్న చిగురుమామిడి మండలం చినముల్కనూరులో 247, సిరిసిల్లలో అదనంగా 1500 ఇళ్లు మంజూరయ్యాయి. సీఎం దత్తత గ్రామంలో మాత్రం మెగా ఇంజనీరింగ్ కంపెనీ 247కు గాను, 230 ఇళ్లు చేపట్టి పనులు చేస్తోంది.
* ఆదిలాబాద్‌లో గృహనిర్మాణశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సొంత గ్రామమైన ఎల్లంపల్లిలో 211 ఇళ్లకు 3సార్లు టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు ముందుకురాని పరిస్థితి.
* ఇద్దరు మంత్రులున్న మహబూబ్‌నగర్ జిల్లాకు 8100 ఇళ్లు మంజూరు కాగా, 337 మాత్రమే నిర్మాణదశలో ఉన్నాయి.
* నల్లగొండ జిల్లా సూర్యాపేటలో కేసీఆర్ పథకాన్ని ప్రారంభించినప్పటికీ మంజూరయిన 4800 ఇళ్లలో 48 మాత్రమే పనులు మొదలయ్యాయి.
* హైదరాబాద్ జిల్లాలో లక్ష ఇళ్లు మంజూరు చేయగా ఐడిహెచ్ కాలనీలోని ఇళ్లు తప్ప ఒక్కటీ పూర్తి కాలేదు. 20చోట్ల స్థలాలను పరిశీలిస్తే, 9 ఖరారయ్యాయి. అక్కడ శంకుస్థాపనలు మాత్రం పూర్తయ్యాయి.
* రంగారెడ్డి జిల్లాలో 6850 ఇళ్లు మంజూరుకాగా, మూడున్నర లక్షల దరఖాస్తులొచ్చాయి. నాలుగుచోట్ల శంకుస్థాపన చేయగా, బల్దియా పరిథిలోని నియోజకవర్గాల్లో ఇప్పటివరకూ స్థల సేకరణ కూడా చేయలేదు.

మార్తి సుబ్రహ్మణ్యం