తెలంగాణ

అసద్‌కు వ్యతిరేకంగా బిజెపి సంతకాల సేకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 20: ఉగ్రవాదులకు న్యాయ సహాయం అందిస్తామని ప్రకటించిన మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు, లోక్‌సభ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీకి వ్యతిరేకంగా బిజెపి రాష్ట్ర శాఖ సంతకాల సేకరణ చేపట్టింది. బుధవారం దిల్‌సుక్‌నగర్‌లో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు దిల్‌సుక్‌నగర్ బస్టాండులో నిలుచున్న వారితో, స్థానికంగా ఉన్న దుకాణాలు, ఇళ్ళకు వెళ్ళి సంతకాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ కార్యకర్తలనుద్దేశించి ప్రసంగిస్తూ అసద్ వ్యాఖ్యల పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. మజ్లిస్ పార్టీని నిషేధించాలని, అసద్‌పై దేశ ద్రోహం కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. తాము ఇదివరకే గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేశామని తెలిపారు.

ఒవైసీకి వ్యతిరేకంగా సంతకాలు సేకరిస్తున్న బిజెపి నేత లక్ష్మణ్
వ్యతిరేకంగా

‘ఒవైసీ న్యాయ సహాయం మాకొద్దు’

హైదరాబాద్, జూలై 20: హైదరాబాద్‌లో ఇటీవల అరెస్టయిన ఇస్లామిక్ స్టేట్ సానుభూతిపరులకు న్యాయ సహాయం అందిస్తామంటూ పార్లమెంట్ సభ్యుడు, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఇచ్చిన భరోసాను నిందితుల కుటుంబ సభ్యులు తిరస్కరించారు. న్యాయ సహాయం ఆఫర్ కేవలం స్వార్థ రాజకీయాల కోసమేనని వారు ఆరోపించారు. మజ్లిస్ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోందని, ఇతర పార్టీలతో పాటు ఇది కూడా జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) పెట్టిన తప్పుడు కేసును వాడుకుంటోందని ఇబ్రహీం యజ్దాని అలియాస్ ఇలియాస్ యజ్దాని కుటుంబ సభ్యులు రాష్ట్ర మానవ హక్కుల సంఘంలో ఓ పిటిషన్ దాఖలు చేశారు. ఇదే విషయమై కొన్ని రోజుల క్రితం దాఖలు చేసిన మరో పిటిషన్‌లో వారు తమకు కోటి రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని కూడా డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పార్టీలతో పాటు హైదరాబాద్‌కు చెందిన ఎంఐఎం కూడా ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోందని, మతం పేరుతో ఓట్లు సంపాదించుకునేందుకు యత్నిస్తోందని యజ్దాని కుటుంబ సభ్యులు నదీరా, మహమ్మద్ ఇషాక్ యజ్దానీలు తమ పిటిషన్‌లో ఆరోపించారు. మజ్లిస్ నేతలు దేశంలోని ముస్లింల మనోభావాలను దెబ్బతీస్తున్నారని నిశితంగా విమర్శించారు. ఎన్‌ఐఏ, హోం మంత్రిత్వ శాఖ, తెలంగాణ డిజిపి, తెలంగాణ హోంశాఖ ముఖ్యకార్యదర్శులను వారు ప్రతివాదులుగా చేర్చారు. వీళ్లంతా తప్పుడు కేసులు బనాయించి మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్నారని ఆరోపించారు.