తెలంగాణ

ఉపాధ్యాయ సంఘాల విలీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 19: ఉపాధ్యాయ సంఘాలు విలీనం కావడంతో ఒకటైన తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ ఇక భవిష్యత్ కార్యాచరణకు ముందడుగు వేసినట్లేనని ప్రొఫెసర్ హరగోపాల్ అభిప్రాయపడ్డారు. ఆదివారం హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన సమావేశంలో ఉపాధ్యాయ సంఘాల విలీన ప్రక్రియ జరిగింది. ఈ సమావేశానికి అధ్యక్షుత వహించిన ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ విద్యా విధానంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న వ్యతిరేక విధానాలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్రాల ఆర్థిక విధానాల వలన ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల అసంతృప్తిని ఎదుర్కొనలేక అణచివేత చర్యలకు పూనుకుంటున్నాయని ఆయన ధ్వజమెత్తారు. ఇన్నాళ్లు వేర్వేరుగా పోరాటాలు చేస్తున్న టీపీటీఎఫ్, టీటీఎఫ్, టీడీటీఎఫ్ సంఘాలు ఒకే గొడుగు పరిధిలోకి రావడాన్ని ఆయన ప్రశంసించారు. మూడు సంఘాలు ఒకే భావజాలంతో గతంలో పని చేశాయన్నారు. ఐక్యంగా విద్యారంగ సంక్షేమానికి, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాయని ఆయన ప్రకటించారు. నూతన విద్యా విధానంతో పేరుతో కేంద్ర ప్రభుత్వం విద్యారంగంపై అదుపును పెంచుకోవడానికి ప్రయత్నించడం విడ్డూరంగా ఉందన్నారు. ఉన్నత విద్యపై రాష్ట్రాలకు స్వేచ్చ లేకుండా చేస్తోందన్నారు. కొత్త శ్రేణుల కలయికతో మరింతగా విద్యా పరిరక్షణ కమిటీ భాగస్వామ్య సంఘమైన టీపీటీఎఫ్ ఉద్యమాలతో సమస్యలను సాధించుకోవాలన్నారు. ఈ సమావేశంలో 18 తీర్మాణాలతో పాటు 5 సాధారణ తీర్మానాలు చేశారు. ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను సీఎం కేసీఆర్ నెరవేర్చాలని నూతన సంఘం డిమాండ్ చేసింది. విద్యా పరిరక్షణ కమిటీ నిర్వహణ కార్యదర్శి లక్ష్మీనారాయణ, ఎపీటీఎఫ్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు నర్సిరెడ్డి, ఉపాధ్యాయ దర్శిని సంపాదకులు వేణుగోపాల్, టీపీటీఎఫ్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కొండల్‌రెడ్డి, మాజీ ప్రధాన కార్యదర్శి మనోహరరాజు ఉన్నారు.
కొత్త కమిటీ సభ్యులు వీరే
తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ కమిటీ అధ్యక్షుడుగా కె. రమణ, అసోషియేట్ అధ్యక్షుడుగా వై. అశోక్‌కుమార్, ప్రధాన కార్యదర్శిగా మైస శ్రీనివాసులు, కార్యదర్శులు నాగమణి, నాగిరెడ్డి, రామాచారి, చంద్రవౌళి ఉన్నారు.