తెలంగాణ

జనసేన గ్రేటర్ హైదరాబాద్ కమిటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 19: జనసేన పార్టీ గ్రేటర్ హైదరాబాద్ కమిటీని పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆదివారం నియమించారు. 12 మందితో కూడిన ఈ కమిటీని కార్యకర్తల అభీష్టంతో ఎంపిక చేశారు. అధ్యక్షునిగా రాధారం రాజలింగం, ప్రధాన కార్యదర్శిగా చిన్నమదిరెడ్డి దామోదర రెడ్డిలు నియమితులయ్యారు. కాగా, కమిటీ ఉపాధ్యక్షులుగా దామరోజు వెంకటాచారి, అచ్చుకట్ల భాను ప్రసాద్, కార్యనిర్వాహక కార్యదర్శులుగా మీర్జా అబిద్, బిట్ల రమేష్, వాకా వెంకటేష్, సిటీ కమిటీ కార్యదర్శులుగా నందగిరి సతీష్ కుమార్, మండలి దయాకర్, కార్య నిర్వాహక సభ్యులుగా రాజేష్, గనపసైమన్ ప్రభాకర్, షేక్ రియాజ్ అలీలను పవన్ కళ్యాణ్ నియమించారు. ఆదివారం మధ్యాహ్నం ప్రశాసన్‌నగర్‌లోని పార్టీ కార్యాలయంలో కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. కమిటీ సభ్యులను పవన్ కళ్యాణ్ అభినందిస్తూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం పాటుపడాలని ఉద్భోధించారు.