తెలంగాణ

జూరాలకు తగ్గిన వరద

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, జూలై 21: జూరాల ప్రాజెక్టుకు వరద తగ్గుముఖం పట్టింది. కేవలం రెండు రోజులు మాత్రమే ప్రవహించిన కృష్ణమ్మ ఒక్కసారిగా తన ఉధృతి తగ్గడంతో శ్రీశైలం మల్లన్న చెంతకు ఈ ఏడాది కృష్ణమ్మ వరద ఈ పరిస్థితుల్లో వచ్చేటట్లు కనపడటంలేదు. జూరాల ప్రాజెక్టుకు గురువారం 19000 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. దాంతో జూరాల ప్రాజెక్టు బ్యాక్‌వాటర్‌ను మహబూబ్‌నగర్ జిల్లాలోని వివిధ రిజర్వాయర్లను నింపడానికి వాడుకుంటున్నారు. అందులో భాగంగా జూరాల ఎడమ కాల్వకు 500 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. కుడి కాల్వకు 300 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. నెట్టెంపాడు ప్రాజెక్టు పరిధిలోని రిజర్వాయర్‌ను నింపడానికి 1500 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తున్నారు. అదేవిధంగా భీమా ఫేజ్-2 కాల్వకు 300 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. జూరాలకు వచ్చిన వరద నీటిని మహబూబ్‌నగర్ జిల్లాలోని వివిధ రిజర్వాయర్లకు విడుదల చేశారు. కోయిల్‌సాగర్ ఎత్తిపోతలకు సైతం జూరాల బ్యాక్‌వాటర్‌నే దాదాపు 400 క్యూసెక్కుల నీటిని ఎత్తిపొస్తున్నారు. నారాయణపూర్ డ్యాం నుండి వచ్చిన నీటిని జూరాల ప్రాజెక్టుల నిల్వ చేసుకుంటూనే కుడి, ఎడమ కాల్వలకు నీటిని విడుదల చేస్తున్నారు. కాగా కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులకు సంబందించిన గేట్లు అన్నింటిని మూసివేశారు. కేవలం నారాయణపూర్ ప్రాజెక్టు దగ్గర మాత్రం విద్యుత్ ఉత్పత్తికి 600 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.