తెలంగాణ

పార్టీ పుట్టినిల్లు కరీంనగర్ కార్పొరేషన్‌లో మళ్లీ తెరాస పైచేయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, జనవరి 27: అధికార తెరాసకు పుట్టినిల్లయిన కరీంనగర్‌లో ఆ పార్టీ మరోసారి విజయఢంకా మోగించింది. బల్దియా ఎన్నికల్లో వరుసగా రెండోసారి గెలిచి తన ఖాతా పునరుద్ధరించుకొని పట్టు నిలుపుకుంది. 60 డివిజన్లకు గాను 33 చోట్ల గెలిచి తన ప్రాబల్యాన్ని చాటుకుంది. నాలుగుచోట్ల వంద లోపు ఓట్లతో సీట్లు చేజార్చుకోగా, 13 డివిజన్లలో బీజేపీ అనూహ్యంగా దూసుకుపోయింది. ఎంఐఎం 6 స్థానాల్లో, స్వతంత్రులు 5 చోట్ల, ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ 3 డివిజన్లలో జయకేతనం ఎగరేసాయి. బీజేపీ 13 డివిజన్లలో విజయం సాధించడంతో పాటు మరో 15 డివిజన్లలో గెలిచిన టీఆర్‌ఎస్ అభ్యర్థులకు ముచ్చెమటలు పట్టించింది. 60 నుంచి 200 లోపు ఓట్ల మెజారిటీతోనే ఆయా డివిజన్లలో టీఆర్‌ఎస్ గెలుపొందింది. మరికొన్ని చోట్ల బీజేపీ రెబల్ అభ్యర్థుల ఆ పార్టీ విజయానికి గండికొట్టారు. కాగా, 2, 3, 6, 7, 8, 12, 14, 16, 17, 20, 21, 22, 23, 24, 25, 28, 29, 30, 33, 35, 37, 39, 41, 42, 43, 45, 46, 49, 51, 53, 56, 59, 60 డివిజన్లలో టీఆర్‌ఎస్ అభ్యర్థులు గెలువగా, వీటిలో 20,37 డివిజన్లు ఏకగ్రీవమయ్యాయి. 1, 10, 13, 15, 26, 32, 36, 38, 44, 48, 55, 57, 58 డివిజన్లలో బీజేపీ అభ్యర్థులు, 4,5, 27, 34, 47, 52 డివిజన్లలో ఎంఐఎం, 9,11,40 డివిజన్లలో ఎఐఎఫ్‌బీ, 18, 19, 31, 50, 54ల్లో స్వతంత్రులు గెలిచారు.
మున్సి ‘పీఠాలన్నీ’ తెరాసకే
ఉమ్మడి జిల్లాలో 14 మున్సిపాలిటీలతో పాటు ఒక కార్పొరేషన్ కూడా తమపరం చేసుకొని మరోసారి తెలంగాణ రాష్టస్రమితి సత్తా చాటింది. రామగుండం కార్పొరేషన్‌తో పాటు 14 మున్సిపాలిటీలు పెద్దపల్లి, సుల్తానాబాద్, మంథని, హుజూరాబాద్, చొప్పదండి, జమ్మికుంట, కొత్తపల్లి, జగిత్యాల, కోరుట్ల, రాయికల్, ధర్మపురి, మెట్‌పల్లి, సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీలను టీఆర్‌ఎస్ కైవసం చేసుకొంది. రామగుండం కార్పొరేషన్ మేయర్‌గా డాక్టర్ బింగి అనిల్ కుమార్, డిప్యూటీ మేయర్‌గా నడిపెల్లి అభిషేక్ రావు, పెద్దపల్లి మున్సిపల్ చైర్‌పర్సన్‌గా చిట్టిరెడ్డి మమత, వైస్ చైర్‌పర్సన్‌గా నజ్‌మీన్ సుల్తానా, సుల్తానాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా ముత్యం సునిత, వైస్ చైర్మన్‌గా బిరుదు సమత, మంథని చైర్‌పర్సన్‌గా పుట్ట శైలజ, వైస్ చైర్మన్‌గా ఆరెల్లి కుమార్, హుజూరాబాద్ చైర్‌పర్సన్‌గా గందె రాధిక, వైస్ చైర్మన్‌గా కొలిపాక నిర్మల, చొప్పదండి చైర్‌పర్సన్‌గా గుర్రం నీరజ, వైస్‌చైర్మన్‌గా ఇప్పనపల్లి విజయలక్ష్మి, జమ్మికుంట చైర్మన్‌గా తక్కళ్లపల్లి రాజేశ్వర్ రావు, వైస్ చైర్మన్‌గా దేశినేని స్వప్న, కొత్తపల్లి చైర్మన్‌గా రుద్ర రాజు, వైస్ చెర్‌పర్సన్‌గా బండ రాధ, జగిత్యాల మున్సిపల్ చైర్‌పర్సన్‌గా భోగ శ్రావణి, వైస్ చైర్మన్‌గా గోలి శ్రీనివాస్, కోరుట్ల మున్సిపల్ చైర్‌పర్సన్‌గా అన్నం లావణ్య, వైస్ చైర్మన్‌గా గడ్డమీది పవన్, రాయికల్ చైర్మన్‌గా మోర హన్మాండ్లు, వైస్ చైర్‌పర్సన్‌గా గండ్ర రమాదేవి, ధర్మపురి చైర్ పర్సన్‌గా సంగి సత్తమ్మ, వైస్ చైర్మన్‌గా ఇందారపు రామన్న, మెట్‌పల్లి మున్సిపల్ చైర్‌పర్సన్‌గా రానవేణి సుజాత, వైస్ చైర్మన్‌గా బోయినపల్లి చంద్రశేఖర్ రావు, సిరిసిల్ల మున్సిపల్ చైర్‌పర్సన్‌గా జిందం కళ, వైస్ చైర్మన్‌గా మంచె శ్రీనివాస్, వేములవాడ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా రామతీర్థపు మాధవి, వైస్ చైర్మన్‌గా మధు రాజేందర్ ఎన్నికయ్యారు.