తెలంగాణ

అసదుద్దీన్ అరెస్టుకు బిజెపి సంతకాల ఉద్యమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 21: ఉగ్రవాద అనుమానితులకు మద్దతు ఇచ్చే విధంగా హైదరాబాద్ ఎంపి అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించి కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని బిజెపి శాసనసభాపక్షనేత జి కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఒవైసీ వ్యాఖ్యలపై టిఆర్‌ఎస్ ప్రభుత్వం తన వైఖరిని బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. ఒవైసీని అరెస్టు చేయాలని కోరుతూ బిజెపి ఇక్కడ సంతకాల ఉద్యమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా నగరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఒవైసీ తీరును కేంద్ర హోంశాఖ దృష్టికి తీసుకెళ్లానని తెలిపారు. ఎన్‌ఐఏ ఇటీవల అరెస్టు చేసిన ఐసిస్ మాడ్యూల్స్‌కు న్యాయ సహాయం చేస్తామని ఎంపి ఒవైసీ ప్రకటించారు. దీనిపై బిజెపి ఆగ్రహం వ్యక్తం చేసింది. హైదరాబాద్‌లో మతపరమైన అల్లర్లను రెచ్చగొట్టేందుకు మజ్లిస్ పార్టీ ప్రయత్నిస్తోందని ధ్వజమెత్తారు.