తెలంగాణ

చెప్పేవి ఆదర్శాలు.. చేసేవి అక్రమాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 28: కారు కూతల కేటీఆర్ నోటికి ఎంత వస్తే అంత అడ్డగోలుగా అబద్దాలు మాట్లాడుతున్నారని, మైక్ ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సహించడానికి ఎవరూ సిద్ధంగా లేరని అన్నారు.అక్రమాలు చేయడం, ఆదర్శాలు వల్లించడం తండ్రీ కొడుకులు ఇద్దరికే చెల్లిందని అన్నారు. సుదీర్ఘ ప్రెస్‌మీట్‌లో సీఎం నీతులు చెబుతున్నారని, నేతి బీరకాయలోని నేతి మాదిరి కేసీఆర్ నీతి అంతే ఉంటుందని అన్నారు. రాజకీయాల్లో విలువలు కాపాడే వ్యక్తులు మరెవరూ లేని రీతిలో ఆదర్శాలు చెప్పారని, కేసీఆర్ అంత పచ్చి అవకాశవాది మరెవరూ లేరని ఇటీవలి మున్సిపల్ ఎన్నికల్లో రుజువు చేశారని లక్ష్మణ్ పేర్కొన్నారు. ఆరుగురు దుఖ:వ్యక్తులకు మొత్తం లక్షణాలు అన్నీ కేటీఆర్‌లో ఉన్నాయని, అభద్రత భావంతో ఎదుటివారిపై ఏడుస్తూ ఉంటారని, ఎదుటివారెవరూ గెలిచినా సహించలేరని, లక్కీ లాటరీ అంటారని, వారు గెలిస్తే మాత్రం ప్రజాతీర్పుగా చెప్పుకుంటారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు వారికి వారే కితాబు ఇచ్చుకుంటారని, ఏ ఎన్నికల ఫలితాలపైనా వారికి తృప్తి ఉండదని పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో రాజకీయ పోరాటమే కాదని, ఒకవైపు టీఆర్‌ఎస్‌తో, మజ్లిస్‌తోనూ, అంతర్లీనంగా కాంగ్రెస్‌తో పోరాటం చేసిందని చెప్పారు. స్వతహాగా ఎవరి ప్రమేయం లేకుండా ఒంటరిగా బీజేపీ పోటీ చేసిందని ఓట్ల శాతాన్ని, సీట్ల సంఖ్యనూ పొత్తులు లేకుండా పెంచుకున్నామని అన్నారు. ఎన్నికల ప్రకటన మొదలు అన్ని దశల్లో ప్రభుత్వం అడ్డదార్లు తొక్కిందని, మున్సిపల్ చట్టంలోని లొసుగులను ఆసరాగా చేసుకుని అక్రమాలకు పాల్పడ్డారని అన్నారు. ఎన్నికల కమిషన్ సైతం నిష్పక్షపాతంగా వ్యవహరించలేని పరిస్థితిని కల్పించారని, ఈ గెలుపు గెలుపేనా అని లక్ష్మణ్ నిలదీశారు. టీఆర్‌ఎస్‌కు పావులుగా ఉన్న పోలీసులు, డబ్బు, మద్యంతో పోరాటం చేశామని , ఏం చేద్దామన్నా అనుమతి లేదని పోలీసులు ఎక్కడకక్కడ అడ్డుకున్నారని చెప్పారు. కేసీఆర్, కేటీఆర్‌లు మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టుందని అన్నారు. ఈ మధ్యకాలంలో టీఆర్‌ఎస్ నేతలు ఎక్కువగా బీజేపీపై ఏడుస్తున్నారని పేర్కొన్నారు. బీజేపీ అభ్యర్ధులు గెలిచి వస్తే కూడా అది గెలుపు కాదన్నట్టు మాట్లాడుతున్నారని అన్నారు. తమ బలంపై నమ్మకం ఉంటే ఎందుకు ప్రత్యక్ష ఎన్నికలకు పోలేదని లక్ష్మణ్ ప్రశ్నించారు. మెజార్టీ తక్కువ ఉన్నా ఎంపీలు,ఎంఎల్‌ఏలను ఉపయోగించుకుని ఎక్స్‌అఫిషియో సభ్యుల ఓట్లతో పదవులను దక్కించుకుందని అన్నారు. ఎన్నికల కమిషన్ నియమాలకు తూట్లు పొడిచారని పేర్కొన్నారు. తక్కుగూడ బీజేపీకి దక్కకూడదని ఆదేశాలు ఇచ్చి ఆంధ్రా ఎంపీని ఉపయోగించి తెలంగాణలో ఓట్లు వేయించుకోడమేనా విలువలతో కూడిన రాజకీయాలు నడపడం ఇదేనా అని ప్రశ్నించారు. ఏప్రిల్ 9న పదవీకాలం ముగుస్తున్న నలుగురు ఎంపీలు ఎలా వోట్లు వేస్తారని అన్నారు. ఈ విషయంలో ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశామని, రాజ్యసభ చైర్మన్‌కూ, రాష్టప్రతికి కూడా ఫిర్యాదు చేస్తామని వెంటనే తక్కుగూడ ఎన్నికను రద్దు చేయిస్తామని అన్నారు. నిరసన వ్యక్తం చేస్తే పోలీసులు కార్యకర్తలపై లాఠీలు ఝులిపించారని చెప్పారు. గతంలో కాంగ్రెస్‌పై గెలిచిన ఎంఎల్‌ఏ టీఆర్‌ఎస్‌లో చేరి మంత్రి అయ్యారని ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తూ విలువలు మాట్లాడటం విచిత్రమని అన్నారు. ఎక్స్ అఫిషియో సభ్యులను ఉపయోగించి నీచ రాజకీయాలకు పాల్పడ్డారని చెప్పారు. తాము కూడా పక్క రాష్ట్రాల ఎంపీలను తెచ్చుకుంటే ఏం చేస్తారని లక్ష్మణ్ ప్రశ్నించారు.
అంతకు ముందు పార్టీ డైరీని లక్ష్మణ్ ఆవిష్కరించారు. పాత్రికేయుల సమావేశంలో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, మాజీ డీజీపీ దినేష్‌రెడ్డి, చింతా సాంబమూర్తి, మనోహర్‌రెడ్డి, మాధవి, రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ డీజీపీ దినేష్‌రెడ్డి మాట్లాడుతూ రాజధాని నగరంలో పోలీసు అధికారులు వ్యవహార సరళి దారుణంగా ఉందని, అధికార పార్టీకి కొమ్ముకాయడం సరికాదని చెప్పారు.