తెలంగాణ

భూమి కొనుగోలుకూ ఉగ్రనిందితుల యత్నం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 21: హైదరాబాద్‌లో విధ్వంసం సృష్టించడానికి పన్నాగం పన్ని దొరికిపోయిన ఉగ్రవాద అనుమానితులు రంగారెడ్డి జిల్లా వికారాబాద్, ధరూర్ మండలాల్లో భూమి కొనుగోలుకు ప్రయత్నించారా? అలాగే అడవుల్లో ఫైరింగ్ ప్రాక్టీసు చేసే అవకాశాలపై వికారాబాద్ వద్ద ఉన్న అడవుల్లో తిరిగారా? ఉగ్రవాద అనుమానితులను నేషనల్ ఇనె్వస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) అధికారులు విచారించినప్పుడు దిగ్భ్రాంతి కలిగించే అనేక విషయాలు వెల్లడయ్యాయి.
ఇబ్రహీం యజ్దానీ అనే ఉగ్రవాద అనుమానితుడు గతంలో వికారాబాద్, ధరూర్ వద్ద ఒక ప్రార్థనామందిరంలో రెండు రోజులు గడిపాడు. ఈ విషయాన్ని స్థానిక మత పెద్దలు నిర్ధారించినట్లు ఎన్‌ఐఏ వర్గాలు తెలిపాయి. వీరి ఫొటోలను తీసుకెళ్లి చూపించగా, స్థానిక ప్రార్థనామందిరాల నిర్వాహకులు వీరు తమ వద్దకు వచ్చారని చెప్పినట్లు తెలిసింది.
వికారాబాద్ వద్ద పొలం కొనేందుకు కూడా వీరు విచారించినట్లు సమాచారం. తమకు యజ్దానీ తదితరులు ఉగ్రవాద అనుమానితులని తెలియదని మత పెద్దలు ఎన్‌ఐఏ వర్గాలకు తెలిపాయి. యజ్దానీ తదితరులను ధరూర్ మండలంలోని కిరెల్, అనంతారం గ్రామాలకు ఎన్‌ఐఏ పోలీసులు తీసుకెళ్లారు. తాము గతంలో బసచేసిన ప్రదేశాన్ని వారు ఎన్‌ఐఏ పోలీసులకు చూపించారు.