తెలంగాణ

బల్దియాల్లో బహుజనులకు ప్రాధాన్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన అధికార తెలంగాణ రాష్ట్ర సమితి సామాజిక న్యాయానికి పెద్దపీట వేసింది. మేయర్, డిప్యూటీ మేయర్, చైర్ పర్సన్, వైస్ చైర్మన్ పదవులకు కల్పించిన రిజర్వేషనే్ల కాకుండా చాలా చోట్ల జనరల్ సీట్లలో బహుజనులకు పదవులు కట్టబెట్టి తన ఉదారతను చాటుకుంది. బీసీ వర్గాలలో ఇప్పటి వరకు రాజకీయంగా ప్రాతినిధ్యం లేని మోస్ట్ బ్యాక్‌వర్డ్ కాస్ట్‌లకు (ఎంబీసీ) పదవులు కట్టబెట్టడం విశేషం. సామాజికంగా వెనుకబడిన వర్గాలకు ప్రాధాన్యం కల్పించడమే కాకుండా గతంలో ఏ రాజకీయ పార్టీ ప్రాతినిధ్యం కల్పించని కుమ్మరి, పట్కారి, పెరిక, రజక, వడ్ల, వెల్లాపు, బుడగజంగాలకు పదవులు ఇచ్చింది. దీంతో బలహీన వర్గాలకు మొదటిసారిగా మున్సిపల్ పాలక వర్గాల్లో రాజకీయ ప్రాతినిధ్యం దక్కింది. మున్సిపల్ ఎన్నికలకు ఖరారు చేసిన రిజర్వేషన్ల కంటే ఎక్కువగా ఈ వర్గాలకు అవకాశం కల్పించింది. జనరల్, జనరల్ మహిళా కేటగిరీలు రిజర్వ్ అయిన మున్సిపాలిటీలలో బీసీ, ఎస్సీ, ఎస్టీ వంటి వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించింది. టీఆర్‌ఎస్ గెలుచుకున్న మున్సిపాలిటీలలో బలహీన వర్గాలకు చెందిన 240 మందికి పదవులు దక్కినట్టు ఆ పార్టీ విశే్లషించింది. ఇందులో అత్యధికంగా బీసీలకు 58 చైర్మన్, మేయర్ పదవులతో పాటు 45 వైస్ చైర్మన్ పదవులతో మొత్తంగా 103 మందికి పదవులు దక్కినట్టు పేర్కొన్నారు. ఓసీ కేటగిరీలో 38 మందికి చైర్మన్ పదువులతో పాటు 46 మందికి వైస్ పదవులు దక్కగా మొత్తంగా 84 పదవులు దక్కినట్టు పేర్కొన్నారు. ఎస్సీ సామాజిక వర్గానికి 17 చైర్మన్, 9 వైస్ చైర్మన్‌లతో పాటు మొత్తంగా 26 పదవులు దక్కాయి. ఎస్టీలలో 5 మందికి చైర్మన్ పదవులు దక్కగా, మైనార్టీ వర్గాలకు 3 చైర్మన్ పదవులతో పాటు 14 వైస్ చైర్మన్ పదవులు దక్కాయి. రాజకీయంగా ఇంతకాలం ప్రాతినిధ్యం లేని వారి కోసం టీఆర్‌ఎస్ ప్రత్యేకంగా దృష్టిసారించి సామాజిక సమీకరణాలపై కసరత్తు చేసింది.
భూపాలపల్లి జిల్లా పరకాలలో దళిత సామాజిక వర్గంలో సఫాయి కులానికి చైర్మన్ పదవిని కట్టబెట్టింది. దీంతో పాటు ఎస్సీలలో నేతకాని, బుడగజంగాలకు సైతం పదవులను కట్టబెట్టింది. బీసీ సామాజిక వర్గాల్లో కుమ్మరి, పట్కారి, పెరిక, రజక, వడ్ల, వెల్లాపు, రెడ్డిక, అవుసుల వంటి కులాలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించింది. బీసీలలో అత్యధికంగా మున్నూరుకాపులకు 21 పదవులు, యాదవులకు 18, కురుమలకు 4, గౌడ్లకు 17, ముదిరాజ్‌లకు 13, పద్మశాలికి 13, లింగాయత్‌కు 6, ఆర్యక్షత్రియకు 3 పదవులను కటట్టబెట్టింది. ఓసీలలో అత్యధికంగా 53 పదవులు దక్కగా ఆ తర్వాత వరుసగా వైశ్యులకు 16, వెలమలకు 5, కమ్మకు2, మర్వాడీకి 2, బ్రాహ్మణులకు 3, కాపులకు 3 పదవులు దక్కాయి. ఎస్సీలలో మాలలకు 6, మాదిగలకు 16, నేతకాని, సఫాయి, బుడగజంగాలకు ఒక్కో పదవి దక్కింది. కాగా జనరల్ స్థానాల్లో కూడా పలు చోట్ల బలహీన వర్గాలకు పదవులు కట్టిబెట్టింది. సూర్యాపేట మున్సిపాలిటీ చైర్ పర్సన్ పదవిని జనరల్ మహిళకు రిజర్వ్ చేయగా అక్కడ దళిత మహిళకు అవకాశం కల్పించింది. అలాగే మేడ్చెల్ జిల్లా పోచారంలో జనరల్ స్థానంలో ఎస్టీకి, ఆదిలాబాద్ జిల్లా కాగజ్‌నగర్ జనరల్‌కు రిజర్వ్ చేయగా మైనార్టీ వర్గానికి అవకాశం కల్పించింది. మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మున్సిపాలిటీని జనరల్‌కు రిజర్వు చేయగా బీసీకి అవకాశం కల్పించింది. రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల మున్సిపాలిటీ జనరల్‌కు కేటాయించగా అక్కడ బీసీకి అవకాశం కల్పించింది. అలాగే కొంపల్లి, దుండిగల్, తాండూర్, ఘట్‌కేసర్ జనరల్‌కు కేటాయించగా ఇక్కడి నుంచి కూడా బీసీలకు అవకాశం కల్పించింది. అలాగే ఖమ్మం జిల్లా కొత్తగూడెం, కోదాడ, నందికొండ, వేములవాడ, సుల్తానాబాద్, మంథని, కొత్తపలి స్థానాలు జనరల్‌కు కేటాయించినప్పటికీ ఇక్కడి నుంచి కూడా బీసీలకు అవకాశం కల్పించింది.