తెలంగాణ

పెరిగిన విద్యుత్ వాడకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 29: రాష్ట్రంలో విద్యుత్ వాడకం గణనీయంగా పెరుగుతోందని, అందుకు పంపిణీ వ్యవస్థను పటిష్టం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. బుధవారం హైదరాబాద్ మింట్‌కాంపౌండ్ ఎస్‌పీడీఎస్‌ఎల్‌లో జరిగిన విద్యుత్ అధికారుల సమీక్షలో మంత్రి పాల్గొన్నారు. ఈ సమావేశానికి ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు, ఎస్‌పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి, ఇంధన శాఖ ముఖ్యకార్యదర్శి అజయ్ మిశ్రా, ఉత్తర తెలంగాణ పంపిణీ వ్యవస్థ సీఎండీ గోపాల్‌రావు హాజరయ్యారు. అధికారులనుద్దేశించి మంత్రి మాట్లాడుతూ తెలంగాణలో విద్యుత్ డిమాండ్ నానాటికీ పెరిగిపోతోందని ఆయన గుర్తుచేశారు. విద్యుత్ డిమాండ్ పెరిగినా అంతరాయం కలుగకుండా చూడాలని మంత్రి అధికారులను ఆదేశించారు. 2019 ఆగస్టులో గరిష్టంగా 11,703 మెగావాట్ల విద్యుత్ నమోదు అయ్యిందన్నారు. ప్రస్తుతం సీజన్‌లో బుధవారం (జనవరి 20వ తేదీ నాటికి) 11వేల మెగావాట్ల విద్యుత్ వాడకం చేరుకుందన్నారు. రానున్న రోజుల్లో 13వేల 500 మెగావాట్లకు పెరిగే అవకాశం ఉందన్నారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల ఎత్తిపోతలకు విద్యుత్ అవసరం ఉందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని అధికారులు ఇతర రాష్ట్రాల నుంచి విద్యుత్‌ను కొనుగోలు చేసుకోవడానికి సన్నాహాలు చేయాలన్నారు. ఇప్పటికే ఎన్‌టీపీసీ నుంచి ముందస్తుగా విద్యుత్‌ను తక్కువ ధరకే కొనుగోలుకు ఒప్పందాలు చేసుకున్నామని మంత్రి దృష్టికి అధికారులు తీసుకువచ్చారు.