తెలంగాణ

ఇక ఆన్‌లైన్‌లోనే ఫ్యాన్సీ నెంబర్లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: సొంత వాహనదారులు తమకు కావాల్సిన ఫ్యాన్సీ నెంబర్లను ఇక నుంచి ఈ-బిడ్డింగ్ ద్వారా దక్కించుకోవచ్చునని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ స్పష్టం చేశారు. బుధవారం హైదరాబాద్ రవాణాశాఖ ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సొంత వాహనదారులు గతంలో ఫ్యాన్సీ నెంబర్ల కోసం మంత్రులు, అధికారులపై వత్తిడి తెచ్చి ఫ్యాన్సీ నెంబర్లను దక్కించుకునేవారని ఆయన గుర్తు చేశారు. కొత్త వాహనదారుడు ఫిబ్రవరి 10వ తేదీ నుంచి తనకు కావాల్సిన ఫ్యాన్సీ నెంబర్‌కు ఈ- బిడ్డింగ్ దరఖాస్తు చేసుకోవచ్చునని మంత్రి ప్రకటించారు. మ్యాన్యువల్ ద్వారా ఫ్యాన్సీ నెంబర్లు విడుదల చేయడంలో అవకతవకలు జరిగేవన్నారు. వాటిని దృష్టిలో పెట్టుకుని ఈ- బిడ్డింగ్ విధానాన్ని అమలులోకి తీసుకువచ్చామన్నారు. దీంతో ఫ్యాన్సీ కోరుకునే వాహనదారులు నిరాశ చెందేవారన్నారు. రాబోవు రోజుల్లో వాహనదారుడు తనకు కావాల్సిన ఫ్యాన్సీ నెంబర్ కోసం ఎక్కడి నుంచి అయినా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చునని అన్నారు. ఈ బిడ్డింగ్ ద్వారా రవాణాశాఖకు ఆదాయం కూడా పెరుగుతుందని మంత్రి అభిప్రాయమడ్డారు. రవాణాశాఖ దాదాపు 59 పౌర సేవలను అందుబాటులోకి తీసుకువచ్చిందన్నారు. రవాణా శాఖపై ఆర్థిక మాంద్యంపై అధికంగా ఉందన్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె కాలం వేతనాలను వచ్చే మార్చి 31న చెల్లిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఆర్టీసీ కార్మికుల నెలనెలా జీతాల కోసం ప్రభుత్వంపై ఎదురుచూసేవారన్నారు. అయితే, ప్రస్తుతం ఆర్టీసీ సొంత కాళ్లపై నిలబడే పరస్థితి ఇప్పుడిప్పుడే ప్రారంభం అయ్యిందన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఆర్టీసీకి దాదాపు 17 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. ఫిబ్రవరి నెలలో సమ్మక్క-సారలమ్మ మేడారం జాతర సందర్భంగా ఆర్టీసీకి గణనీయంగా ఆదాయం వచ్చే సూచనలు ఉన్నాయన్నారు. మేడారం వెళ్లే భక్తులకు అవసరమైన బస్సులను సిద్ధంగా ఉంచామన్నారు. ఆర్టీసీ కార్గో వాహనాలను ఫిబ్రవరి నెలలో అందుబాటులోకి తెస్తామన్నారు. ప్రైవేట్ పార్శిల్ రవాణా కంటే ఆర్టీసీ పార్శిల్ చార్జీలు తక్కువ ఉండేలా చూస్తామన్నారు. ఆర్టీసీలో వివిధ రకాల విడిభాగాల వస్తువుల ధరలు పెరగడంతో అనివార్యంగా చార్జీలు పెంచక తప్పలేదన్నారు. పెంచిన చార్జీల పట్ల ప్రజల్లో వ్యతిరేకత రాలేదన్నారు. ఆర్టీసీ రూట్లను ప్రైవేటీకరణ చేస్తారా? అన్న ప్రశ్నకు సమాధానంగా మంత్రి సమాధానం ఇస్తూ ప్రైవేట్ ఆలోచన ప్రభుత్వానికి లేదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీకి బ్రాండ్ అంబాసిడర్‌గా తీసుకురావడానికి విస్తృత ప్రచారాన్ని చేపడుతున్నామన్నారు. ఆర్టీసీ సమ్మె తర్వాత ఉద్యోగుల పట్ల డీఎం, ఆర్‌ఎంలు వేధింపులు పెరగడంతో కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని వస్తున్న విమర్శలను మంత్రి తోసిపుచ్చారు. రాష్ట్రంలో ఎక్కడైనా కార్మికుల పట్ల ఆర్టీసీ అధికారులు తప్పుగా వ్యవహరిస్తే తప్పకుండా 24 గంటల్లో చర్యలు తీసుకొంటామని హెచ్చరించారు. రాష్ట్రంలో తెరాస హవా కొనసాగుతోందని మంత్రి పువ్వాడ పేర్కొన్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో నాలుగు పార్లమెంట్ స్థానాలు దక్కించుకున్న భాజాపా స్థానిక ఎన్నికల్లో బొక్కబోర్లా పడిందన్నారు. చివరికి రెండు పురపాలక స్థానాలకు భాజాపా పరిమితం అయ్యిందని వ్యంగ్యంగా అన్నారు. కాంగ్రెస్, భాజాపా బయటకి విమర్శించుకున్నా లోపల ఇద్దరు ఒక్కటే అన్నారు. విపక్షాల రాజకీయ వ్యవహారాన్ని ప్రజలు అసహ్యించుకొంటున్నారని మంత్రి అన్నారు. హైదరాబాద్ ఖైరతాబాద్‌లోనే తన కార్యాలయ పరిపాలన సాగిస్తానని, ఏదైనా సమస్యలు ఉంటే ఇక్కడికి వచ్చి ఫిర్యాదు చేసుకోవచ్చునని మంత్రి ప్రకటించారు.

*చిత్రం...హైదరాబాద్ రవాణా శాఖ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతున్న పువ్వాడ అజయ్ కుమార్