తెలంగాణ

కాంగ్రెస్‌కు అవగాహన లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 29: ఎన్నికల చట్టాలపై కాంగ్రెస్ నేతలకు ఏమాత్రం అవగాహన లేదని తెలంగాణ రాష్ట్ర సమితి దుయ్యబట్టింది. ఎక్స్ ఆఫీషియో ఓట్లపై రాద్ధాంతం చేస్తోన్న టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి అసలు ఎన్నికల చట్టాలపై అవగాహన ఉందా? అని రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, టీఎస్‌ఐఐసీ చైర్మన్ గాదరి బాలమల్లు ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్‌లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణకు అడ్డుపడి, కుట్రలకు పాల్పడిన కేవీపీ రామచంద్రరావుకు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఎక్స్ ఆఫీషియో సభ్యుడిగా ఎన్నికల సంఘంపై వత్తిడి చేసి ఓటు కల్పించారని విమర్శించారు. ఇదంతా ఎందుకు ఏకంగా టీపీసీసీ అధ్యక్షునిగా కేవీపీకి కట్టబెట్టడితే సరిపోదా? అని ఎద్దేవా చేశారు. తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు ఇంకా వలసవాద భావజాలం పోలేదని మండిపడ్డారు. ఎన్నికల నియామావళి ప్రకారమే నేరుడుచర్ల మున్సిపాలిటీని టీఆర్‌ఎస్ కైవసం చేసుకుందన్నారు. అయినప్పటికీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఎదో జరుగరానిది జరిగినట్టు దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ సాధించిన ఘన విజయాన్ని కాంగ్రెస్, బీజేపీలు జీర్ణించుకోలేక పోతున్నాయని అన్నారు. తాము ప్రజలను నమ్ముకుంటే ఈ రెండు పార్టీలు కుట్రదారులను నమ్ముకుంటున్నారని దుయ్యబట్టారు. అన్ని ఎన్నికల్లో బీజేపీని ప్రజలు తిరస్కరించినా బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ తీరు మారలేదన్నారు. ఇవీఎంలైనా, బ్యాలెట్‌తోనైనా ఎన్నికలు ఎలా నిర్వహించినా విజయం టీఆర్‌ఎస్‌దేనని మరోసారి నిరూపితమైందని అన్నారు.
*చిత్రం...సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి