తెలంగాణ

వలస జిల్లాకు దిలాసా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, జూలై 21: తెలంగాణ కోటి ఎకరాల మాగాణి అయ్యేవరకూ విశ్రమించబోమని, ప్రాజెక్టులు నిర్మించి రైతుల పొలాలను తడిపి వారి కళ్లల్లో ఆనందాన్ని చూస్తామని భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులు అయిన భీమా ఫేజ్-2, నెట్టెంపాడు ఫేజ్-2, కల్వకుర్తి ఫేజ్-2ల పంప్‌లను ఆ గురువారం ప్రారంభించి కృష్ణాజలాలను వదిలారు. దీంతో శంకర సముద్రం, రామన్‌పాడు, ర్యాలంపాడు, కోయిల్‌సాగర్ రిజర్వాయర్‌లోకి కృష్ణాజలాలు పరుగు పెట్టాయి. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో హరీశ్‌రావు మాట్లాడుతూ పాలమూరు జిల్లాకు తొలి ఫలితం దక్కిందని, ఈ ఫలితం తెలంగాణ రాష్ట్రం ఏర్పడినందుకే గత 30 ఏళ్ల నుంచి పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసి రైతుల పొలాల్లోకి కృష్ణాజలాలను వదలడం జరిగిందన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా అంటేనే వలసల జిల్లా అని ప్రపంచమంత చెప్పుకుంటుందని, రానున్న కాలంలో ఇక పాలమూరుకే ప్రజలు వలసలు వచ్చేలా తయారవుతుందన్నారు. భీమా ప్రాజెక్టు 1985లో మంజూరు అయ్యిందని ఈ ప్రాజెక్టుకు 20 టిఎంసిల నీటి కేటాయింపు ఉన్నప్పటికీ ఏ రోజూ ఒక్క టిఎంసి నీటిని కూడా కృష్ణానది నుండి తీసుకున్న పాపాన పోలేదని అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, కల్వకుర్తి పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.900కోట్లు ఖర్చు చేసిందన్నారు. మరో రూ.1600కోట్లకుపైగా ఖర్చు చేస్తే పెండింగ్ ప్రాజెక్టులన్ని పూర్తి అవుతాయన్నారు. టిడిపి, కాంగ్రెస్ నాయకులు పెండింగ్ ప్రాజెక్టులను 90శాతం పూర్తి చేశామని చెప్పే మాటల్లో వాస్తవం లేదని, వారు నిధులు మాత్రమే 90 శాతం డ్రా చేసుకున్నారని, పనులు మాత్రం 40 నుండి 55 శాతం పెండింగ్‌లో పెట్టారని తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక టిఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మోటర్లు, డిస్టిబ్యూటర్లు, సంపులను నిర్మించి వాటిని ప్రస్తుతం 80 శాతానికి తీసుకువచ్చామన్నారు. తాము పూర్తి చేసిన పనుల్లోనే ఒక్కొక్క పంప్‌ను ప్రస్తుతం ప్రారంభించామని వీటి ద్వారా ఈ ఖరీఫ్ సీజన్‌లో 4.50 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించనున్నామని వెల్లడించారు. వచ్చే ఏడాది ఖరీఫ్‌లో మరో 8లక్షల ఎకరాలకు మహబూబ్‌నగర్ జిల్లాలో సాగునీరును అందిస్తామన్నారు. మహబూబ్‌నగర్ ప్రాజెక్టులకు చంద్రబాబునాయుడు శిలఫలాలు వేస్తే వైఎస్ రాజశేఖర్‌రెడ్డి రాళ్లు వేశారని ఆయన ఎద్దేవా చేశారు. కృష్ణాజలాలపై ఇకమీదట పాలమూరు ప్రజలకే మొదటి హక్కు అని మంత్రి హరీష్‌రావు తెల్చి చెప్పారు.

చిత్రం.. జూరాల ప్రాజెక్టు దగ్గర భీమా ఫేజ్-2కు నీటిని విడుదల చేస్తున్న మంత్రి హరీశ్‌రావు