తెలంగాణ

దేశాన్ని, పరిశ్రమను శక్తివంతం చేసేదే: ఫిక్కీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: కేంద్రబడ్జెట్ దేశానికి, పరిశ్రమలకు, సంస్థలకు, వ్యక్తుల సాధికారతను అందించేలా ఉందని ఫిక్కీ అధ్యక్షురాలు డాక్టర్ సంగీతారెడ్డి అన్నారు. ఆర్థిక శాఖమంత్రి అవరోధాలను ఎదుర్కొంటూ చేసిన ఒక సమగ్ర ప్రకటనగా ఉందన్నారు. ప్రభుత్వం ప్రశంసనీయమైన పనిచేసిందన్నారు. ఎఫ్‌ఆర్‌బీఎం డీవియోషన్ క్లాజ్‌ను అమలు చేయడం, ప్రస్తుత సంవత్సరంలో ఆర్థిక లోటును 3.8 శాతానికి సడలించడం ద్వారా వచ్చే ఏడాదికి దానిని 3.5 శాతం లక్ష్యంగా చేకోవడం వంటివి ఆర్థిక వ్యవస్థకు , ఆర్థిక పరిపుష్టి అవసరమన్నారు.
వ్యక్తిగత ఆదాయం పన్ను తగ్గింపు, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించే విధంగా ఉందన్నారు. యువత వ్యాపారులు, ఇతర ప్రజానీకం మార్పుకు సిద్ధంగా ఉన్న వారి శక్తులను కేంద్రీకరించి పెద్ద మార్పును సాధించే అవకాశాన్ని కేంద్ర బడ్జెట్ జారవిడిచిందని లోక్‌సత్తా వ్యవస్థాపకులు డాక్టర్ జయప్రకాశ్ నారాయణ్ అన్నారు. దేశానికి ఒక వ్యూహాత్మక పెద్ద అడుగు అవసరమన్నారు. 1991లో పీవీ నరసింహారావువేసిన అడుగు విప్లవాత్మకమైనదన్నారు. ఏడాదికి ఒక కోటి ఉద్యోగాలను సృష్టించాలనే ప్రయత్నమే బడ్జెట్‌లో కనిపించలేదన్నారు. వ్యసాయంలో కూడా సుమారు పాతికేళ్ల క్రితం నుంచి చెబుతున్న మాటలనే వల్లె వేశారన్నారు. ఆహార సబ్సిడీ కోసం వెచ్చిస్తున్న రూ.1.80లక్షల కోట్లను ఉత్పాదకతను పెంచే రీతిలో ఖర్చు చేయాలని, ఆర్థిక సర్వే కూడా సూచించినా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. దిశలేని బడ్జెట్‌లు కాకుండా, పరిష్కారాన్ని ఇచ్చే వినూత్న పద్ధతులు ఇప్పుడు దేశానికి అవసరమన్నారు. కేంద్రబడ్జెట్‌లో ఆరోగ్య సంరక్షణకు గణనీయమైన ప్రాధాన్యత లభించిందని ఆపోలో హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ ప్రతాప్ రెడ్డి, గ్రూప్ అధ్యక్షుడు డాక్టర్ కె హరిప్రసాద్ అన్నారు. స్వచ్ఛ్భారత్, పరిశుభ్రమైన తాగునీరు, మహిళలకు, పిల్లలకు మెరుగైన పోషకాహారం, ఫిట్ ఇండియా ఉద్యమం, వెల్‌నెస్ కేంద్రాలు ఆరోగ్యాన్ని ప్రోత్సహించే గొప్ప కార్యక్రమాలని పేర్కొన్నారు.
ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్స్ రీజనల్ చైర్మలన్ ఇస్రార్ అహ్మద్ మాట్లాడుతూ, తయారీ, వౌలిక సదుపాయాల రంగానికి ప్రోత్సాహం ఇచ్చే విధంగా బడ్జెట్ ఉందన్నారు. పాలు, కూరగాయల రవాణా కోసం రిఫ్రజరేటర్ రైల్వే కోచ్‌లను ప్రవేశపెట్టడాన్ని ఆయన స్వాగతించారు.
మత్స్య సంపద 2022-23నాటికి 200 లక్షల టన్నులకు చేరుకుంటుందన్నారు. జెఎల్‌ఎల్ సీఈవో రమేష్ నాయర్ మాట్లాడుతూ గృహ రంగం, వౌలిక సదుపాయాలకు ఊతం ఇచ్చే విధంగా బడ్జెట్ ఉందని, రియాల్టీ సెక్టార్‌పై ఎటువంటి ప్రభావం లేదన్నారు. డాటా సెంటర్ల వల్ల రానున్న రోజుల్లో 4 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వస్తాయన్నారు. కేంద్ర బడ్జెట్ బాగుందని, పరిశ్రమలు, వౌలిక సదుపాయాల రంగాలకు ప్రోత్సాహకరంగా ఉందని సీఐఐ జాతీయాధ్యక్షుడు విక్రమ్ కిర్లోస్కర్ అన్నారు. వ్యవసాయరంగానికి మంచి ఊతాన్ని ఇచ్చారన్నారు. కిమ్స్ హాస్పిటల్స్ ఎండీ డాక్టర్ బొల్లినేని భాస్కర్ రావు మాట్లాడుతూ ఆయుష్మాన్ భారత్‌ను టైర్ -2, టైర్-3 పట్టణాలకు విస్తరించడం, ఆరోగ్య సంరక్షణకు ఇతోధికంగా నిధులు మంజూరు చేయడాన్ని ప్రశంసించారు. 2025 నాటికి టీబీ వ్యాధిని నిర్మూలించాలన్న ప్రభుత్వ సంకల్పం గొప్పదన్నారు.