తెలంగాణ

తెలంగాణ పురోగతిపై ప్రతికూల ప్రభావం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* అన్ని ప్రధాన రంగాలకు కోతలు * భారీ కోతల బడ్జెట్ ఇది
హైదరాబాద్, ఫిబ్రవరి 1: కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ నిరాశాజనకంగా ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శించారు. కేటాయింపులు ప్రగతికాముక తెలంగాణ పురోగతిపై ప్రతికూల ప్రభావం చూపనున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రావాల్సిన నిధుల్లో కేంద్రం భారీ కోతలను విధించడం ద్వారా కేంద్రం వివక్షను చూపిందన్నారు. కేంద్ర పన్నుల్లో తెలంగాణకు రావాల్సిన వాటా నిష్పత్తిని తగ్గించడం దారుణమన్నారు.
నిధుల్లో భారీ కోతలు విధించిన ఫలితంగా తెలంగాణ రాష్ట్రంలో అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలకు నిధుల కొరత ఎదురయ్యే ప్రమాదం ఏర్పడిందన్నారు. కేంద్ర బడ్జెట్‌పై ప్రగతిభవన్‌లో నాలుగు గంటల పాటు ఆయన సమీక్ష నిర్వహించారు. కేంద్రపన్నుల్లో రాష్ట్రాల వాటా రాజ్యాంగ పరమైన హక్కు అన్నారు. గత ఏడాది రూ.19,718 కోట్లు రావాల్సి ఉండగా, సవరించిన అంచనాల్లో రూ.15,987 కోట్లకు కుదించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.3731 కోట్ల నిధులు తగ్గాయి. కేంద్రం నుంచి రూ.19,718 కోట్లు వస్తాయనే ఉద్దేశ్యంతో రాష్ట్రం రూపొందించుకున్న ఆర్థిక ప్రణాళిక కేంద్రం నిధుల్లో కోత విధించడం వల్ల తారుమారైందన్నారు. గత ఏడాది ఏకంగా 18.9 శాతం తగ్గుదల రావడం వల్ల కేంద్రప్రభుత్వ ఆర్థిక వ్యవహారాల నిర్వహణలో లోపానికి నిదర్శనమన్నారు. వచ్చే ఏడాది ప్రతిపాదనల్లో తెలంణకు వచ్చే నిధుల్లో రెండురకాల నష్టం వాటిల్లిందన్నారు. కేంద్రానికి వచ్చే పన్నుల్లో రాష్ట్రాలకు చెల్లించే వాటాను 42 శాతం నుంచి 41 శాతానికి తగ్గిస్తూ 15వ ఆర్థిక సంఘం చేసిన సిఫార్సులను కేంద్రం ఆమోదించింది. రాష్ట్రానికి గతంలో 2.437 శాతం వాటాను ఇవ్వగా, ఈ ఏడాది ఈ వాటాను 2.133 శాతానికి తగ్గించారు. పన్నుల్లో వాటాగారావాల్సిన నిధుల్లో రూ.2381 కోట్లు తగ్గనున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రగతి ప్రణాళికలపై పడుతుందన్నారు. వచ్చే ఏడాది నిధులను రూ.16,7276 కోట్లను ఇస్తామని కేంద్రం ప్రతిపాదించిందన్నారు. అంచనాలు సవరించే నాటికి ఎంత తగ్గిస్తారో తెలియదన్నారు. చెప్పే మాటలకు, ఆచరణకు మధ్య పొంతనలేదని కేసీఆర్ విమర్శించారు.కేంద్రం మాట నమ్మితే శంకర గిరి మాన్యాలే దిక్కయ్యే పరిస్థితి ఏర్పడిందన్నారు.
జీఎస్‌టీ విషయంలో పెద్ద మోసం దగాకు కేంద్రం పాల్పడుతోందన్నారు. 14 శాతం లోపు ఆదాయ వృద్ధిరేటు కలిగిన రాష్ట్రాలకు ఏర్పడే లోటును ఐదేళ్ల పాటు భర్తీ చేస్తామని జీఎస్‌టీ చట్టంలో చెప్పారన్నారు. జీఎస్‌టీ పరిహారంగా ఇంకా రూ.1137 కోట్లు ఇవ్వాల్సి ఉందని, దీనిపై స్పష్టత ఇవ్వలేదన్నారు. పట్టణాల అభివృద్ధికి నిధుల కేటాయింపులో భారీ కోత పెట్టారన్నారు. రాష్ట్రంలో పట్టణాల అభివృద్ధికి ఈ ఏడాది రూ.1037 కోట్లుక ఏటాయిస్తే, వచ్చే బడ్జెట్‌లో రూ.148 కోట్లు తగ్గించి, రూ.889 కోట్లు కేటాయించారన్నారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలకు రూ.24వేల కోట్ల సహాయం తెలంగాణ రాష్ట్రం అందివ్వాలని నీతి అయోగ్ సిఫార్సులు చేసినా పట్టించుకోలేదన్నారు.
సాగునీటి రంగం ప్రాజెక్టులకు నిధులు ఇవ్వలేదన్నారు. అన్ని ప్రధాన రంగాల్లో కోతలు విధించారన్నారు.14 శాతం ఆదాయ వృద్ధిరేటులేని రాష్ట్రాలకు జీఎస్‌టీ పరిహారం అందిస్తామనే చట్టం హామీని కేంద్రం తుంగలో తొక్కిందన్నారు. చాలా నెలలుగా దేశంలో నెలకొన్న ఆర్థిక మందగమనాన్ని అధిగమించేందుకు కేంద్రం ఎలాంటి ప్రగతిశీల నిర్ణయాలు ప్రకటించలేదన్నారు. వ్యవసాయరంగానికి ఈ ఏడాది 3.65 శాతం మేర నిధులు కేటాయించగా, వచ్చే ఏడాది 3.39 శాతం నిధులు కేటాయించారన్నారు. వైద్య రంగానికి 2.24 శాతం నుంచి 2.13 శాతానికి, గ్రామీణాభివృద్ధికి రూ.4.37 శాతం నుంచి 3.94 శాతానికి, విద్యా రంగానికి 3.37 శాతం నుంచి 3.22 శాతానికి నిధులు తగ్గించారన్నారు.