తెలంగాణ

ఇది నిర్లిప్తమైన బడ్జెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* కొత్తదనం లేదు: వినోద్ కుమార్
* దేశాన్ని దగా చేసిన బీజేపీ
పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి
* ఎల్‌ఐసీ, ఐడీబీఐల్లో ప్రభుత్వ వాటాలను
అమ్ముకోవడం దుర్మార్గమని వ్యాఖ్య
** భరోసా లేని పేలవం
* సీనియర్ కాంగ్రెస్ నేత,
కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి
* పెట్టుబడిదారులకు కొమ్ముకాసేదే..
పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల ధ్వజం

హైదరాబాద్, ఫిబ్రవరి 1: పార్లమెంటులో ఆర్థికశాఖ మంత్రి సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ నిర్లిప్తమైనదని, కొత్తదనం ఏమీ లేదని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌చైర్మన్ బోయినపల్లి వినోద్‌కుమార్ అన్నారు. ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ రెండవసారి అధికారం చేపట్టినా సొంతంగా చెప్పపుకునే ఒక్క ఫ్లాగ్ షిప్ పథకం కూడా లేకపోవడం బాధాకరమని ఆయన అన్నారు.
ఆయా శాఖలకు పద్దుల కేటాయింపులో కొత్త ఆలోచనలు ఏమీ లేవని, రొటీన్‌గా కేటాయింపులు చేశారన్నారు. యంగ్ దేశంగా చిత్రీకరిస్తూ, యువతరానికి ఒక్క పథకం కూడా ప్రకటించలేదన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ కోసం నయాపైసా కూడా బడ్జెట్‌లో పెంచలేదన్నారు. విద్యా, ఆరోగ్యం ముఖ్యమని చెబుతున్న కేంద్రం బడ్జెట్‌లో మాత్రం కేటాయింపులు చేయలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏ కోణంలో చూసినా బడ్జెట్ దేశానికి ప్రయోజనకరంగా లేదన్నారు. ఈ బడ్జెట్ వల్ల తెలంగాణకు ఒరిగిందేమీ లేదన్నారు.
సీనియర్ కాంగ్రెస్ నేత, జాతీయ కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి మాట్లాడుతూ బడ్జెట్‌లో పేదల వ్యతిరేకమైనదన్నారు. రైతులకు ఉపయోగపడేదేమీ లేదన్నారు. వ్యవసాయ ఆదాయం రెట్టింపుఅనే మాట మళ్లీ మాట్లాడారన్నారు. కలల బడ్జెట్ అని, పేదల నడ్డివిరిచే బడ్జెట్ అన్నారు.
ఎల్‌ఐసీ, ఐడీబీఐలలో ఉన్న ప్రభుత్వ వాటాలను అమ్ముకోవాలనుకోవడం దుర్మార్గమైనదన్నారు. వైద్యం, రైల్వేల్లో పీపీసీ పెట్టుబడులు ఆహ్వానించడం ప్రైవేట్‌కు లాభం చేయడానికే అన్నారు. నాలుగేళ్ల క్రితం పెద్ద కరెన్సీ నోట్లను రద్దు చేసినప్పటి నుంచి ఆర్థిక వ్యవస్థ కుదేలైందన్నారు. బ్యాంక్‌లపైన ఇందిరమ్మ కల్పించిన భరోసా మోదీ లేకుండా చేశారన్నారు. బడ్జెట్‌లోస తీపి మాటలు, చేదు ప్రతిపాదనలు పెట్టారన్నారు. వ్యవసాయానికి ఊతం ఇవ్వలేదన్నారు. పరిశ్రమలు దారి తప్పాయన్నారు. దేశంలోనిరుద్యోగం పెరిగిందన్నారు. ప్రజలను మభ్యపెట్టే బడ్జెట్ అని, ప్రజలకు మేలు చేసే అంశాలేమీ లేవన్నారు.
పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతూ పెట్టుబడీదారుల కొమ్ముకాసే విధంగ కేంద్ర బడ్జెట్ ఉందాన్నరు. సామాన్యుల ఆశలపై నీళ్లు చల్లారన్నారు. ఏడాదిలో జీడీపీ 10 శాతానికి పెంచుతామనడం ఆశ్చర్యకరమన్నారు. మరో ఏడాదిలో రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామనడం ఎవరి చెవిలో పూలు పెడుతున్నారో అని ఆయన అన్నారు. విభజన హామీల ప్రస్తావన లేదన్నారు. టీఆర్‌ఎస్ ఎంపీలు ఏమి చేస్తున్నారని ఆయన నిలదీశారు.
తెలంగాణ రాష్ట్రాన్ని తీవ్రంగా నిరాశపరిచే విధంగా దగా బడ్జెట్‌ను కేంద్రం ప్రవేశపెట్టిందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. ఆదాయం పన్ను శ్లాబుల్లో కొన్ని మార్పులు తప్ప, బడ్జెట్‌లో కొత్తగా ఏమీ లేదని ఆయన పేర్కొన్నారు. నిరుద్యోగ యువత, రైతులు, మహిళలు, విద్యార్థులు, ఉద్యోగాలను సృష్టించే రంగాల కోసం బడ్జెట్‌లో ఏమీ కేటాయింపు లేవన్నారు. 45 సంవత్సరాల గరిష్ట స్థాయిలో ఉన్న నిరుద్యోగం పెరగడంపై బడ్జెట్ ప్రసంగంలో ప్రస్తావించలేదన్నారు. ద్రవ్యోల్బణం పెరుగుతున్నట్లు ప్రస్తావించలేదన్నారు. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని ఎలా రెట్టింపు చేయాలని ప్రభుత్వం యోచిస్తోందన్నారు. వివిధ కారణాల వల్ల వేలాది మంది రైతుల ఆత్మహత్యకు కారణాల వల్ల బాధపడుతున్న కోటి మంది రైతుల గురించి ప్రస్తావించలేదన్నారు. పీపీపీ పద్ధతిలో ఒక జిల్లా ఆసుపత్రికి ఒక వైద్య కళాశాలను జత చేయాలని ప్రతిపాదించిన పథకం వల్ల ఆ ఆసుపత్రుల్లో వైద్య సేవలకు ప్రజలు డబ్బు చెల్లించాల్సి ఉంటుందన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం సమర్థమైన పనిచేసి కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలో విఫలమైందన్నారు. రాష్ట్రాలకు పన్నుల పంపిణీపై ఎటువంటి స్పష్టత ఇవ్వలేదన్నారు. పెండింగ్ బకాయిలు ఎప్పుడు ఇస్తారని ఆయన అన్నారు.
*చిత్రాలు.. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి
* ప్రణాళికా సంఘం రాష్ట్ర వైస్‌చైర్మన్
బోయినపల్లి వినోద్‌కుమార్