తెలంగాణ

నవ భారత నిర్మాణానికి ఊతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 1: కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ నవ భారత నిర్మాణానికి ఊతమిచ్చేలా ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్ పేర్కొనగా, కేంద్ర బడ్జెట్ అన్ని వర్గాల ప్రజలకు సంతృప్తినిచ్చిందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జీ కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. కేంద్ర బడ్జెట్ జనరంజకంగా ఉందని పార్టీ ప్రధాన కార్యదర్శి చింతా సాంబమూర్తి చెప్పారు. 2022 నాటికి పేదరికం, అవినీతి, ఉగ్రవాదం, వివక్ష , అపరిశుభ్రత లేని నవ భారత నిర్మాణానికి అనుగుణంగా అభివృద్ధి, సంక్షేమానికి సమతూకంగా ప్రాధాన్యమిస్తూ సంస్కరణలకు పెద్ద పీట వేసిందని లక్ష్మణ్ అన్నారు. వ్యవసాయ, సాగునీరు, గ్రామీణాభివృద్ధికి మొదటి ప్రాధాన్యమిస్తూ ఆరోగ్యం, పారిశుద్ధ్యం, తాగునీరు ద్వితీయ ప్రాధాన్యంగా, విద్య, చిన్నారుల సంక్షేమాన్ని మూడో ప్రాధాన్యంగా ప్రకటించడంతో నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకునేందుకు అవసరమైన వ్యూహం కనిపిస్తోందని అన్నారు. ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న ప్రస్తుత క్లిష్ట సమయంలోనూ ప్రజల అంచనాలను అందుకుంటూ వాస్తవిక బడ్జెట్‌ను కేంద్రం ప్రవేశపెట్టిందని లక్ష్మణ్ చెప్పారు. ఈ సందర్భంగా ఆయన ప్రధాని నరేంద్రమోదీకి, ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు అభినందనలు తెలిపారు. వ్యవసాయాభివృద్ధి 16 సూత్రాల కార్యక్రమం, మరో 20 లక్షల మందికి సోలార్ పంప్‌సెట్‌లు, గిడ్డంగుల నిర్మాణానికి ప్రోత్సాహం, పప్పు్ధన్యాల సాగు, ఉద్యాన పంటలు, కూరగాయలు, పాల ఉత్పత్తిపై దృష్టి సారించడం, వ్యవసాయ మార్కెట్‌లను సరళీకరించడం, విమానాల ద్వారా పంటల రవాణాకు కృషి సారించడం, విమానాల ద్వారా పంట రవాణాకు కృషి చేయడం , కిసాన్ రైలు లాంటి చర్యలు అన్నీ 2022 నాటికి రైతు ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు దోహదం చేస్తుందని అన్నారు. ఆవాజ్ యోజన ద్వారా మరిన్ని ఇళ్లు నిర్మిస్తామనడం పేదలకు వరమని అన్నారు. కొత్త స్లాబులు ప్రకటించి, ఆదాయపన్ను తగ్గించడం మధ్యతరగతికి మరింత ఊరట అని అన్నారు. బ్యాంకింగ్ వ్యవస్థను పటిష్టపరచడం, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సరళీకృతం చేయడం ఊతమిచ్చే అంశాలని అన్నారు.
మంచి ప్రణాళికలు: కిషన్‌రెడ్డి
దేశంలో వౌలిక రంగం అభివృద్ధికి వచ్చే ఐదేళ్లలో 1.03 లక్షల కోట్లతో ప్రణాళిక మంచి నిర్ణయమని కిషన్‌రెడ్డి అన్నారు. వ్యవసాయ రంగానికి 15 లక్షల కోట్ల రూపాయిల రుణ ప్రణాళిక ప్రకటించి, రైతులు ఎవరూ పెట్టుబడుల కోసం ప్రైవేటు వ్యక్తులు, సంస్థలపై ఆధారపడకుండా ఉండే విధంగా కృషి చేస్తున్నారని అన్నారు. ఉద్యోగ వర్గాలు, మధ్యతరగతి కుటుంబాలకు వ్యతికత పన్ను చెల్లింపులో రాయితీలు వల్ల కొనుగోలు శక్తి పెంచడానికి దోహదపడుతుందని అన్నారు. చిన్న , మధ్య తరగతి పరిశ్రమలకు వ్యాపారవేత్తలకు ఈ బడ్జెట్‌లో కేటాయించిన రాయితీలు తప్పకుండా సత్ఫలితాలను ఇస్తాయని చెప్పారు.
*చిత్రం... కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జీ కిషన్‌రెడ్డి