తెలంగాణ

ఇది శరాఘాతమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 1: తెలంగాణ రాష్ట్భ్రావృద్ధికి కేంద్ర బడ్జెట్ శరాఘాతంలా మారిందని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. కేంద్రపన్నుల్లో రాష్ట్రాల వాటా గణనీయంగా తగ్గించివేశారని, ఇది ఊహించని దెబ్బ అన్నారు. 2019-20లోనే పన్నుల వాటా 18.9 శాతం మేర తగ్గించారన్నారు. జాతీయ ఆర్థిక వ్యవహారాలను సక్రమంగా ఆజమాయిషీ చేయడంలో కేంద్రం విఫలమైందన్నారు. తెలంగాణ రాష్ట్రానికి నీతిఅయోగ్ రూ.24వేల కోట్లు ఇవ్వాలని సిఫార్సు చేసిందన్నారు. కాని వీటిని కేంద్రం పట్టించుకోలేదన్నారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ స్కీంలకు కేంద్రం నిధులు కేటాయించలేదన్నారు. ప్రతిష్టాకరమైన ఈ స్కీంలకు కేంద్రం ఒక్క రూపాయి కూడాకేటాయించలేదన్నారు. ఎకనామిక్ సర్వేను చూస్తే తెలంగాణ అభివృద్ధిలో వేగవంతంగా ఉందని పేర్కొన్నట్లు చెప్పారు. కాని నిధుల కేటాయింపు నిరాశాజనకంగా ఉందన్నారు. సంక్షేమ కార్యక్రమాలపై ప్రతికూల ప్రభావం పడుతోందన్నారు.