తెలంగాణ

ఉద్యోగ నియామకాల్లో అక్రమాలకు తావు లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 1: ఉద్యోగ నియామకాల్లో ఎలాంటి అక్రమాలకు తావులేదని పబ్లిక్ సర్వీసు కమిషన్ కార్యదర్శి ఏ వాణి ప్రసాద్ పేర్కొన్నారు. ఇటీవల కొంత మంది కావాలని పనిగట్టుకుని సర్వీసు కమిషన్ పైనా, ఉద్యోగ నియామకాలపైనా ఆరోపణలు చేస్తున్నారని, అవి సరికాదని ఆమె వివరణ ఇచ్చారు. టీచర్సు రిక్రూట్‌మెంట్ టెస్టు ఎస్‌జీటీ (తెలుగు) పోస్టుల నియామకానికి సంబంధించి పీహెచ్ కేటగిరిలో ఎంపిక కాని వారు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. సర్వీసు కమిషన్ ఎంపిక విధానంలో ప్రతి దశలో ఎన్నో జాగ్రత్తలు పాటిస్తుందని, కొంత మంది అభ్యర్ధులు ఎలాంటి ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. సురక రామకృష్ణ అనే అభ్యర్ధి లిఖిత పరీక్షలో 53.209 మార్కులు సాధించారని, అయితే ఆయన పీహెచ్ రిజర్వేషన్ క్లెయిమ్ చేశారని పీహెచ్‌లో కనీసం 40 శాతం వైకల్యత ఉన్న వారే ఆ కోటాలో రిజర్వేషన్ పొందేందుకు అర్హులని చెప్పారు. ఆయన వైకల్యతను పరీక్షించేందుకు మెడికల్ బోర్డుకు పంపించగా, 40 శాతం వైకల్యత నిర్ధారణ కాలేదని చెప్పారు. 2017లో ఇచ్చిన టీఆర్టీ నోటిఫికేషన్‌లో సురక రామకృష్ణ దరఖాస్తు చేసుకున్నారని, రిజర్వుడ్ కేటగిరిలో మార్కుల మెరిట్‌తో ఆయనను వడపోత జాబితాలో తీసుకున్నామని, అయితే తర్వాత పీహెచ్ కోటాలో ఆయన నిర్ధారణ పొందలేకపోయారని సర్వీసు కమిషన్ కార్యదర్శి పేర్కొన్నారు. రంగారెడ్డి డీఈఓ ఆయన వైకల్యత నిర్ధారణకు మెడికల్ బోర్డుకు పంపినపుడు 40 శాతం కంటే తక్కువ దృష్టి వైకల్యం ఉన్నట్టు తేల్చారని అన్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా ఎవరూ కమిషన్‌పై ఆరోపణలు చేయవద్దని ఆమె హితవు పలికారు