తెలంగాణ

సవాళ్లకు పరిష్కారమేదీ?: సీపీఐ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 1: ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లకు కేంద్ర బడ్జెట్ పరిష్కారం చూపలేకపోయిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి పేర్కొనగా, కేంద్ర బడ్జెట్ కేవలం కార్పొరేట్లకు ఊడిగం చేసేలా ఉందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఎద్దేవా చేశారు.ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న ఆర్ధిక మాంద్యం, నిరుద్యోగానికి కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎలాంటి పరిష్కారం చూపలేనని, ఇది దిశ లేని అంకెల గారడీ బడ్జెట్ మాత్రమేనని చాడ వెంకటరెడ్డి విమర్శించారు.లాభాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థ ఎల్‌ఐసీ షేర్లను ఆమ్మేస్తామని ప్రకటించడం దారుణమని అన్నారు.
ఆరేళ్లు వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలో నెట్టి, ఇపుడు లక్షల కోట్లు ఇవ్వడం అంటే ఏడిపించి ఓదార్చడమేనని అన్నారు. పేదల అభ్యున్నతి, శ్రామికుల జీవనాదాయం పేరుగుదలకు కేంద్ర బడ్జెట్ ఎలాంటి చర్యలూ తీసుకోలేదని తమ్మినేని వీరభద్రం చెప్పారు. గత బడ్జెట్‌పై 2.5 లక్షల కోట్లు అదనంగా చేర్చి 30.42 లక్షల కోట్లతో ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్‌లో ప్రజలకు భ్రమలను గురిచేసే వాగ్దానాలను చేశారని అన్నారు.
దళితులు, గిరిజనులు, మహిళలు, వికలాంగుల అభివృద్ధికి గత ఏడాది కేటాయింపులే ఖర్చు చేయలేదని, ఈ ఏడాది కేటాయింపులు పెరగలేదని అన్నారు. 20వేల కొత్త దవాఖానాలు నిర్మిస్తామని చెప్పినా ఆరోగ్య రంగానికి తగిన నిధులను కేటాయించలేదని, దేశంలో మలేరియాతో ఏటా 5.6లక్షల మంది చనిపోతున్నారని, తాగునీటిపై గత బడ్జెట్‌పై కేవలం 1500 కోట్లు మాత్రమే అదనంగా కేటాయించారని తమ్మినేని పేర్కొన్నారు. 370 ఆర్టికల్ రద్దు నుండి బయటపడటానికి జమ్మూ కాశ్మీర్‌కు 30వేల కోట్లు, లడక్‌కు ఆరు వేల కోట్లు కేటాయించారని, ఆరేళ్లు గడచినా విద్య, ఆరోగ్య రంగాల్లో ఏ మాత్రం పెరుగుదల లేదని తమ్మినేని అన్నారు.
స్వావలంబన నాశనం: సీఐటీయూ
దేశ ఆర్ధిక స్వావలంబనను కేంద్ర బడ్జెట్ నాశనం చేసిందని సీఐటీయూ అధ్యక్షుడు చుక్క రాములు, ప్రధాన కార్యదర్శి ఎం సాయిబాబులు వ్యాఖ్యానించారు. బీజేపీ ప్రభుత్వం విదేశీ, స్వదేశీ కార్పొరేనట్ శక్తులకు లొంగిపోయిందని అన్నారు.
రైతులకు నిరాశ: రైతు సంఘం
కేంద్ర బడ్జెట్ రైతులను నిరాశ పరిచిందని తెలంగాణ రైతు సంఘం అధ్యక్షుడు పీ జంగారెడ్డి, కార్యదర్శి టీ సాగర్‌లు పేర్కొన్నారు. రైతుల ఆకాంక్షలను నెరవేర్చే విధంగా లేదని, రైతుల ఆదాయాన్ని 2022 నాటికి రెట్టింపు చేస్తామని, వ్యవసాయ రంగానికి, గ్రామీణ అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చామని ఘనంగా ప్రకటించి ఆచరణలో మాత్రం రైతుల ఆకాంక్షలను నెరవేర్చే ప్రయత్నం చేయలేదని వారు చెప్పారు. గత ఏడాది కేంద్రం వ్యవసాయ పథకాలకు 1.30 లక్షల కోట్లు చూపించి, సవరించిన బడ్జెట్‌లో 1.01 లక్షల కోట్లుకు కుదించారని కొత్త బడ్జెట్‌లో దీనిని 1.34 లక్షల కోట్లుగా చూపించారని అన్నారు.
మొక్కుబడి కేటాయింపులు
కేంద్ర బడ్జెట్‌లో విద్యారంగానికి మొక్కు బడి కేటాయింపులే చేశారని సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ స్టడీస్ చైర్మన్ నాగటి నారాయణ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. గత ఏడాది గంటే ఈసారి ఇంకా తక్కువగా నిధులను కేటాయించారని అన్నారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను తీసుకువచ్చి పేదలకు విద్యను దూరం చేసే కుట్రను కేంద్రం చేసిందని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎల్ మూర్తి, కార్యదర్శి టీ నాగరాజు విమర్శించారు. విద్యను ప్రైవేటీకరణను ప్రోత్సహించే రీతిలో బడ్జెట్ ఉందని టీపీటీఎఫ్ ప్రధాన కార్యదర్శి మైన శ్రీనివాస్ విమర్శించారు. ఆదాయపు పన్నులో కొత్త మెలికలు పెట్టి మధ్య తరగతి ఉద్యోగులకు తీవ్ర నష్టం కలిగించేట్టుందని టీఎస్ యూటీఎఫ్ నేత రవి విమర్శించారు.