తెలంగాణ

రాష్ట్ర బడ్జెట్‌కు ‘అదును’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 1: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2020-21 సంవత్సరానికి సంబంధించి ఈ నెలలో ప్రవేశపెట్టబోయే రాష్ట్ర వార్షిక బడ్జెట్‌కు ‘అదును’ అయింది. కేంద్ర ఆర్థిక మంత్రి పార్లమెంట్‌లో శనివారం ప్రతిపాదించిన బడ్జెట్ ప్రకంపనలు రాష్ట్ర ప్రభుత్వం ఖజానాపై, రాష్ట్ర బడ్జెట్‌పై ప్రభావం చూపిస్తోంది. కేంద్రం నుండి ఉదారంగా నిధులు వస్తాయని భావించిన రాష్ట్రానికి ‘విపత్కర’ పరిస్థితి ఎదురైంది. దాంతో 2020-21 సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం రూపొందించనున్న బడ్జెట్ చెప్పుకోదగ్గ స్థాయిలో ఉండకపోవచ్చని ఆర్థిక నిపుణులు అంచనావేస్తున్నారు. నిర్మలా సీతారామన్ ప్రతిపాదించిన బడ్జెట్ ద్వారా రాష్ట్రానికి వచ్చే నిధులకు సంబంధించి ఆర్థిక శాఖాధికారులు, నిపుణులు కూలంకషంగా పరిశీలిస్తున్నారు. కేంద్రంపై భారీ ఆశలు పెట్టుకుని 2019-20 సంవత్సరానికి తెలంగాణ ప్రభుత్వం భారీగా బడ్జెట్‌ను ప్రతిపాదించింది. 2019 ఫిబ్రవరిలో ప్రతిపాదించిన బడ్జెట్ 1,82,000 కోట్ల రూపాయలు కావడం గమనార్హం. అప్పట్లో ఎన్నికల సమయం కావడంతో పూర్తిస్థాయి బడ్జెట్‌ను తర్వాత ప్రతిపాదించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. సాధారణ ఎన్నికల తర్వాత బడ్జెట్ ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వం కుదించుకోవాల్సి వచ్చింది. 2019 సెప్టెంబర్‌లో 1,46,000 కోట్ల రూపాయలకు ప్రతిపాదించారు. అంటే 36 వేల కోట్ల రూపాయలకు బడ్జెట్‌ను కుదించుకోవాల్సి వచ్చింది. కేంద్రం నుండి అనుకున్న విధంగా నిధులు రాకపోవడంతో పాటు ఆర్థిక మాంద్యం ప్రభావమే కారణమని ప్రభుత్వం అప్పట్లో ప్రకటించింది. అయితే 2019-20 సంవత్సరానికి సవరించిన బడ్జెట్ ఏ విధంగా ఉంటుందన్న అంశంపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ఇలా ఉండగా ఈ నెలలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించబోయే బడ్జెట్‌పై ఉన్నతస్థాయిలో కసరత్తు జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం పన్నుల నుండి మన రాష్ట్రానికి 2020-21 ఏడాదికి 16,726 కోట్ల రూపాయలు మాత్రమే వస్తాయని వెల్లడి కావడంతో పాలకుల్లో అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. 2019-20 సంవత్సరంలో 19,718 కోట్ల రూపాయలు వస్తాయని భావించగా, 3,731 కోట్ల రూపాయలు తక్కువగా రావడంతో అసంతృప్తి వ్యక్తమైంది. భారీ నీటిపారుదల ప్రాజెక్టులకు కేంద్రం చేయూత లభిస్తుందని, జీఎస్టీ రూపంలో రావలసిన నిధులు తదితరాలు అన్నీ కలుపుకుని కనీసం 30 వేల కోట్ల రూపాయలైనా కేంద్రం నుండి వస్తాయని రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులు భావించారు. వాస్తవ పరిస్థితి వీరి అంచనాలను తలకిందులు చేసింది. ఈ పరిస్థితిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ బడ్జెట్‌కు వెళ్లకపోవచ్చని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. 2020-21 సంవత్సరానికి 1,50,000 కోట్ల రూపాయల వరకు బడ్జెట్ ప్రతిపాదనలు ఉండవచ్చని అంచనావేస్తున్నారు. కేంద్రం నుండి ఎక్కువ నిధులు రాబట్టుకునేందుకు ప్రయత్నించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.