తెలంగాణ

ప్రతిసారీ అన్యాయమే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 2: తెలంగాణ రాష్ట్రానికి బడ్జెట్‌లో ప్రతిసారీ అన్యాయమే జరుగుతోందని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇది ఆరవ బడ్జెట్ అని ఆయన గుర్తు చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న వారి ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురావడం చేతకాని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌కు సీఎం కేసీఆర్‌ను విమర్శించడం ఒక్కటే వస్తుందని కేటీఆర్ మండిపడ్డారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో కేటీఆర్ సమక్షంలో శంషాబాద్ మున్సిపాలిటీకి చెందిన 8 మంది ఫార్వర్డ్ బ్లాక్ కౌన్సిలర్లు టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదాపై లక్ష్మణ్ ఏ రోజైనా మాట్లాడారా? అని ఆయన
ప్రశ్నించారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథకు కేంద్రం ఆర్థిక సహాయం అందించాలని నీతి ఆయోగ్ సిఫారసు చేసినా స్పందించలేదని, ఈ విషయంపై లక్ష్మణ్ ఎందుకు మాట్లాడరని కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ పట్ల కేంద్రం వివక్షపై ఏనాడూ స్పందించని బీజేపీ నాయకులకు హిందూ, ముస్లింల మధ్య చిచ్చుపెట్టి చలి కాచుకోవడం తప్ప చేసిందేమీ లేదని ధ్వజమెత్తారు. రాజ్యాంగబద్ధంగా తెలంగాణకు రావాల్సిన నిధుల కన్నా ప్రధాని మోదీ సర్కార్ నయాపైసా అదనంగా ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. బడ్జెట్‌లో తెలంగాణకు కేంద్రం మొండి చేయి చూపినా రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఆగవని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ను ఎదుర్కోవడం చేతగాక సిద్ధాంతాలు పక్కనపెట్టి కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కయ్యాయని దుయ్యబట్టారు. బీజేపీతో కలిసి పనిచేయడం ఇదేమి దౌర్భగ్యమని కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతురావే నిలదీశారని కేటీఆర్ గుర్తు చేశారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఇద్దరూ పెద్ద పెద్ద డైలాగులకే పరిమితం అయ్యారని ఆయన విమర్శించారు. రాష్ట్ర చరిత్రలో మునుపెన్నడూ లేనివిధంగా రికార్డు స్థాయిలో టీఆర్‌ఎస్ మున్సిపాలిటీలను గెలుచుకుందన్నారు. జాతీయ పార్టీలుగా చెప్పుకునే కాంగ్రెస్, బీజేపీ కనీసం మూడవ స్థానంలో కూడా లేవన్నారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు అంతనంత దూరంలో కాంగ్రెస్, బీజేపీ ఉండిపోయాయని ఆయన విమర్శించారు. ఈ రెండు పార్టీల కంటే ఇండిపెండెంట్లు, తిరుగుబాటు అభ్యర్థులే రెండో స్థానంలో నిలిచారని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్‌కు దేశవ్యాప్తంగా ఎక్కడా ఓట్లు వేసే పరిస్థితి లేదన్నారు. రాష్ట్రానికి సీఎం కేసీఆరే శ్రీరామ రక్ష అని...ఇదే స్ఫూర్తితో తెలంగాణ సమాజమంతా ఐకమత్యంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. తమది పేద ప్రజల ప్రభుత్వమని, వారి కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి వారి గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయిందన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పాటించిన సామాజిక న్యాయానికి బీసీ సంఘాలన్నీ ఐక్యంగా సీఎం కేసీఆర్‌ను ప్రశంసించాయని అన్నారు. ఎన్నికలు ఏవైనా టీఆర్‌ఎస్‌దే విజయమని ఇప్పటికే అనేకమార్లు నిరూపితమైందన్నారు.
*చిత్రం... తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతున్న కేటీఆర్