తెలంగాణ

రాష్ట్రపతికి ఘనంగా వీడ్కోలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 2: రెండు రోజుల పర్యటనకు శనివారం హైదరాబాద్ వచ్చిన భారతరాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఆయన భార్య సవితా కోవింద్ ఆదివారం మధ్యాహ్నం న్యూఢిల్లీ వెళ్లిపోయారు. శనివారం హైదరాబాద్‌లోనే రాష్ట్రపతి దంపతులు మకాం చేశారు. ఆదివారం ఉదయం హైదరాబాద్ సమీపంలోని కన్హా శాంతివనం సందర్శించారు. శ్రీరామచంద్ర మిషన్ ఏర్పాటై 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా శాంతివనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. శాంతివనం కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత తిరిగి హైదరాబాద్ చేరారు. ఆదివారం మధ్యాహ్నం బేగంపేట విమానాశ్రయంలో రాష్ట్రపతి దంపతులకు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ, తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు, హైదరాబాద్ నగర మేయర్ దొంతు రాంమోహన్, ఉపముఖ్యమంత్రి మహ్మద్ మహమూద్ అలీ, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఘనంగా వీడ్కోలు పలికారు. రాష్ట్రపతికి వీడ్కోలు పలికేందుకు విమానాశ్రయానికి వచ్చిన ప్రముఖులను ముఖ్యమంత్రి ఈ సందర్భంగా రాష్ట్రపతికి పరిచయం చేశారు. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి. వినోద్‌కుమార్‌ను పరిచయం చేస్తుండగా, మూడు సార్లు పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసి, తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న వినోద్ కుమార్ తనకు చిరపరిచితులేనంటూ రామ్‌నాథ్ కోవింద్ నవ్వుతూ చెప్పారు. రాష్టప్రతికి గవర్నర్‌తో పాటు ముఖ్యమంత్రి శాలువాలు కప్పి సత్కరించారు. హైదరాబాద్‌లో వాతావరణం చాలా బాగుందని, శనివారం, ఆదివారం తాను సంతోషంగా ఇక్కడ గడిపానని రాష్ట్రపతి ఈ సందర్భంగా గవర్నర్ తదితరులతో మాట్లాడుతూ పేర్కొన్నారు. హైదరాబాద్ తాను ఎప్పుడు వచ్చినా తన్మయత్వానికి గురవుతానని, ఇక్కడి పాలకులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు చూపే ఆప్యాయత మరువలేనని అన్నారు. హైదరాబాద్‌లో తనకోసం తయారు చేసే ఆహారపదార్థాలు కూడా చాలా బాగా ఉంటాయని కోవింద్ పేర్కొన్నట్టు తెలిసింది. రాష్ట్రపతి హైదరాబాద్ రావడం తనకూ సంతోషంగానే ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సందర్భంగా పేర్కొన్నట్టు అధికార వర్గాలు తెలిపాయి.

బేగంపేట విమానాశ్రయంలో ఆదివారం రాష్ట్రపతి కోవింద్‌కు వీడ్కోలు పలుకుతున్న సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ తదితరులు