తెలంగాణ

సొమ్మొకడిది... సోకొకడిది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: కేంద్రం సంక్షేమ పథకాలను ప్రకటించి, వాటికి నిధులను సమకూరుస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఆ పథకాల పేర్లను సవరించుకుని, నిధులు వాడుకుని తమ పథకాలుగా ప్రచారం చేసుకుంటోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్ ఆరోపించారు. కేంద్ర బడ్జెట్‌పై ముఖ్యమంత్రి కుమారుడు, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూనిరాగాలు తీస్తున్నారని, రాష్ట్రానికి ఆయన గజనీలా తయారయ్యారని ఎద్దేవా చేశారు. కేంద్ర బడ్జెట్‌ను ప్రజలంతా స్వాగతించారని ఆయన చెప్పారు. సోమవారం నాడు పార్టీ కార్యాలయంలో ఆయన పాత్రికేయులతో మాట్లాడారు. బడ్జెట్‌పై కేటీఆర్ తీరు అవగాహనా రాహిత్యమని, బడ్జెట్ ఎలా ఉంటుందో అతనికి తెలియకపోవడం దురదృష్టకరమని విమర్శించారు. కేటీఆర్ జేబులు నింపేందుకో, ప్రాజెక్టుల పేరుతో కమీషన్‌లు నొక్కేందుకో బడ్జెట్ ఉండదని ఆయన చెప్పారు. తెలంగాణలో బీజేపీకి అనుకున్న సీట్లు రాకపోయినా, రాష్ట్భ్రావృద్ధికి అన్నివిధాలా కేంద్రం సహకరిస్తోందని అన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం మాత్రం అనాలోచిత, అసంబద్ధ విధానాలు, ఏకపక్ష నిర్ణయాలతో రాష్ట్ర ఆర్థిక స్థితి
దిగజారిందని ఆయన అన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి భారీ ప్రాజెక్టులు, వాటి మీద వచ్చే కమీషన్లు తప్పితే సంపద సృష్టి, ఆదాయ వనరుల పెంపుపై దృష్టి లేదని ఆయన అన్నారు. మద్యంపై తప్పితే రాష్ట్రంలో ఏ రంగంలో ఆదాయం పెరిగిందో చెప్పాలని లక్ష్మణ్ నిలదీశారు. కేసీఆర్ కేంద్ర మంత్రిగా ఉన్నపుడు రాష్ట్రానికి ఏం తెచ్చారో చెప్పాలని ఆయన నిలదీశారు. కేసీఆర్ కేంద్ర మంత్రిగా కొనసాగిన యూపీఏ ప్రభుత్వంతో పోలిస్తే ఎన్డీఏ ప్రభుత్వం పది రెట్లు ఎక్కువగా కేంద్ర సాయంగా అందించిందని ఆయన అన్నారు. కేటీఆర్ తీరు చూస్తుంటే ఢిల్లీలో కాళ్లు, హైదరాబాద్ కన్నీళ్లు అన్నట్టుందని లక్ష్మణ్ ఎద్దేవా చేశారు. ఢిల్లీకి వెళ్లి ప్రాజెక్టులు మంజూరు చేయించుకుని, నిధులు తెచ్చుకుంటున్నారని, హైదరాబాద్ వచ్చి వాటిని మరిచిపోతున్నారని ఆయన విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కేటీఆర్ బట్ట కాల్చి మీదపడేసినట్టు వ్యవహరిస్తున్నారని, విభజన చట్టంలో కాళేశ్వరాన్ని జాతీయ హోదా ఇస్తామనే మాటే లేదని, ప్రాజెక్టుకు సంబంధించి డీపీఆర్‌లు సమర్పించాలని కేంద్రం కోరినా ఇంతవరకూ రాష్ట్రం ఇవ్వలేదని, డీపీఆర్‌లు సమర్పిస్తే తమ అవినీతి అక్రమాలు బయటపడతాయనేది వారి భయమని ఆయన వ్యాఖ్యానించారు. లక్ష కోట్ల రూపాయిల పనులకు సంబంధించి టెండర్లు పిలవకుండానే నామినేషన్లపై నంచుకుని తినేశారని, భారీగా కమీషన్లు దండుకున్నారని ఆయన చెప్పారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథకు నీతి ఆయోగ్ సిఫార్సు చేసినా కేంద్రం నిధులు ఇవ్వలేదని కేటీఆర్ ఆరోపణలు చేస్తున్నారని, కానీ ఇది సరికాదని అన్నారు. కేంద్రం పథకాలకు గులాబీ రంగు పులిమి తమ పథకాలుగా గొప్పలు చెప్పుకుంటున్నారని ఆయన ధ్వజమెత్తారు. రూపాయికి కిలో బియ్యంలో కేంద్రం వాటా 28 రూపాయిలైతే రాష్ట్రం వాటా కేవలం రెండు రూపాయిలు మాత్రమేనని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రానికి కేంద్రం వేల కిలోమీటర్లు కొత్త జాతీయ రహదారులను మంజూరు చేసిందని, వేల కోట్ల రూపాయిలు ఇచ్చిందని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రసూతి సాయం పథకంలో సగం నిధులు కేంద్రం ఇస్తున్నవేనని, అవన్నీ మరచి ఆరోపణలు చేయడం విడ్డూరమని చెప్పారు. కేసీఆర్ కుటుంబ పాలన నుండి రాష్ట్రాన్ని విముక్తం చేయడానికి ప్రజలు ఎదురుచూస్తున్నారని, ప్రజా ఉద్యమాల ద్వారా ప్రజలకు మరింత చేరువ అవుతామని లక్ష్మణ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ తరఫున గెలిచిన కార్పొరేటర్లను సత్కరించారు.

*చిత్రం...మీడియాతో మాట్లాడుతున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్