తెలంగాణ

బాధ్యతలు చేపట్టిన కొత్త కలెక్టర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట, ఫిబ్రవరి 3: జిల్లా కలెక్టర్‌గా టి.వినయ్‌కృష్ణారెడ్డి ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు. కలెక్టర్‌గా పనిచేస్తున్న దుగ్యాల అమయ్‌కుమార్ గత నెల 27న రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా బదిలీ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం రాత్రి చేపట్టిన ఏఎఎస్‌ల బదిలీల్లో భాగంగా జనగాం కలెక్టర్‌గా పనిచేస్తున్న వినయ్‌కృష్ణారెడ్డిని ఇక్కడికి బదిలీ చేశారు. దీంతో సోమవారం ఆయన కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ జిల్లాను అన్ని రంగాల్లో అగ్రపధంలో నిలిపేందుకు కృషిచేస్తానని చెప్పారు. అభివృద్ది, సంక్షేమ పథకాలను అర్హులకు అందించేలా పనిచేస్తానన్నారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్‌కు జేసీ డి.సంజీవరెడ్డి, డీఆర్‌వో పి.చంద్రయ్య, జడ్పీ సీఈవో విజయలక్ష్మిలతో పాటు పలుశాఖల జిల్లా అధికారులు స్వాగతం పలికారు.