తెలంగాణ

సహకార ఎన్నికలకు ఓటర్ల జాబితా సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మిర్యాలగూడ, ఫిబ్రవరి 3: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ఓటర్ల జాబితాను సిద్ధం చేశారు. మిర్యాలగూడ నియోజకవర్గంలో 9 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో 18,133 మంది ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. నియోజకవర్గంలోని 9 సహకార సంఘాల్లో 117 వార్డుల్లో 18,133 మంది ఓటర్లున్నారు. అయితే అధికారులు ఓటర్ల జాబితాను, సంఘాల డైరెక్టర్ల రిజర్వేషన్లను ఖరారు చేశారు. కాగా అన్నారం సహకార సంఘంలో 664 మంది, మిర్యాలగూడ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో 1,099 మంది, ఆలగడప సహకార సంఘంలో 3,328 మంది, తడకమళ్ల సహకార సంఘంలో 2,548 మంది, తుంగపహాడ్ సంఘంలో 538 మంది, దామరచర్ల సహకారం సంఘంలో 3,908 మంది, శెట్టిపాలెం సహకారం సంఘంలో 692 మంది, సల్కునూర్ సహకార సంఘంలో 4,087 మంది, వేములపల్లి సహకార సంఘంలో సుమారు 1,269 మంది ఓటర్లున్నారు. ప్రతి సహకార సంఘంలో 13 మంది డైరెక్టర్లు ఉండేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. అయితే ఒక్కొక్క డైరెక్టర్ పరిధిలో 52 మంది ఓటర్లు ఉండేలా చర్యలు తీసుకున్నారు. అయితే చిన్న సహకార సంఘాల్లో డైరెక్టర్ల పరిధిలో తక్కువగా ఓటర్లున్నారు. అయితే చైర్మన్‌కు ఎలాంటి రిజర్వేషన్ లేకుండా డైరెక్టర్లకు మాత్రమే రిజర్వేషన్లు చేశారు. ఇది కూడా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో అన్ని వర్గాలకు ప్రాతినిద్యం కలిగించాలి. ప్రతి సొసైటీలో 13 మంది డైరెక్టర్లుండగా ఎస్సీ జనరల్ 1, ఎస్సీ మహిళ 1, ఎస్టీ జనరల్ 1, బీసీ జనరల్ 1, బీసీ మహిళ 1, జనరల్ మహిళకు 1, మిగిలిన 7 జనరల్‌కు కేటాయించారు. అయితే ప్రతి సంఘంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు ఖరారు చేసిన తరువాత జనరల్ స్థానాలను నిర్ణయించారు. కాగా సొసైటీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అధికార పార్టీ నుండి అత్యధికంగా పోటీ పడుతున్నారు. గతంలో జరిగిన ప్రతి ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థులు గెలుపొందడంతో ఆ పార్టీ నుండి పోటీ చేసేందుకు అత్యధిక మంది పోటీ పడుతున్నారు. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ నుండి కూడా పోటీ చేసేందుకు పోటీ పడుతున్నారు. రాజకీయాలకు అతీతంగా జరగాల్సిన వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికలు కూడా రాజకీయంగానే జరుగుతుండడంతో రసవత్తరంగా మారాయి.