తెలంగాణ

ప్రాణమున్నంత వరకూ టీఆర్‌ఎస్‌లోనే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగర్‌కర్నూల్, ఫిబ్రవరి 3: ప్రాణం ఉన్నంత వరకు తాను టీఆర్‌ఎస్‌లో కొనసాగుతానని, సీఎం కేసీఆర్, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తానని మాజీ మంత్రి, టీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. సోమవారం స్థానిక ఓ ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో జూపల్లి మాట్లాడుతూ తాను పదవులకోసం పార్టీలు మారే వ్యక్తిని కానని, తెలంగాణ కోసం ఇంకా పదవీకాలం ఉన్నప్పటికీ మంత్రి పదవికి రాజీనామా చేసి కేసీఆర్ నాయకత్వంలో ఉద్యమంలో పాల్గొన్నానని గుర్తు చేశారు. తనపై కొందరు పనిగట్టుకొని పార్టీ మారుతున్నట్టు వదంతులు సృష్టిస్తున్నారని, పూటకో పార్టీ మార్చే నైజం తనది కాదంటూ ఇటీవల కాలంలో వస్తున్న వదంతులను తీవ్రంగా ఖండించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక 70 ఏళ్లలో జరగని అభివృద్ధి సీఎం కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ఈ ఆరేళ్లకాలంలో జరిగిందన్నారు. సాగునీటి పథకాలతో పాటు తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించడం, అభివృద్ధి, సంక్షేమ పథకాలు సమానంగా జరుగుతూ యావత్తు దేశానికే ఆదర్శంగా రాష్ట్రం నిలిచిందన్నారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్రం బంగారు తెలంగాణ వైపు దూసుకుపోతోందన్నారు. శాసనసభ ఎన్నికలు మొదలుకొని రాష్ట్రంలో జరిగిన ప్రతి ఎన్నికలలో టీఆర్‌ఎస్ విజయాలను సాధించి దేశంలోనే నూతన చరిత్రను సృష్టించిందన్నారు. కుటుంబంలో చిన్నచిన్న తగాదాలు సహజమని, అదేవిధంగా కొల్లాపూర్ నియోజకవర్గంలోని టీఆర్‌ఎస్ కుటుంబంలో కూడా చిన్న చిన్న కలహాలు వచ్చాయని, అవి సర్దుకుపోతాయన్నారు. ప్రజలకోసమే జీవిస్తున్న తనతో పాటు గత 20 ఏళ్ల నుంచి ప్రజలతో కలిసి పనిచేస్తున్న వారు ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల సమయంలో స్థానిక పరిస్థితుల కారణంగా భావోద్వేగానికి గురై ఆత్మగౌరవంతో పోటీ చేయగా, ప్రజలు కూడా వారిని ఆదరించారని అన్నారు.
వీరంతా కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నవారేనని అన్నారు. నియోజకవర్గంలో ఇంకా కొన్ని పనులు పెండింగ్‌లో ఉన్నాయని వాటిని పూర్తి చేస్తూ నియోజకవర్గం అభివృద్ధి కోసం, ప్రజల సమస్యల పరిష్కారం కోసం సీఎం కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకత్వంలో పనిచేస్తానని అన్నారు. ఈ విలేఖరుల సమావేశంలో పెద్దకొత్తపల్లి ఎంపీపీ ప్రతాప్‌గౌడ్, పార్టీ మండల అధ్యక్షుడు నర్సింహ్మ, మాజీ ఎంపీపీ చిన్నయ్య తదితరులు పాల్గొన్నారు.