తెలంగాణ

ఉప్పొంగిన భక్తి భావం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేడారం ఆంధ్రభూమి బృందం, ఫిబ్రవరి 5: మేడారం మహాజాతర ప్రారంభ మైంది. రాష్ట్రం నుంచే కాక, పలు రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు లక్షలాది గా తరలివచ్చారు. బుధవారం సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు ఆగమనంతో మేడారం జాతర కోలాహలంగా ప్రారంభమైంది. జంపన్నవాగు, కనె్నపల్లి, ఊరట్టం, ఎలుబాక, కొత్తూరు, రెడ్డిగూడెం ప్రాంతాలన్నీ భక్తుల గుడారాలతో నిండిపోయాయి. గుడారాల్లో మొక్కుల్లో ప్రధానమైన ఎత్తు బంగారం (బెల్లం), వెదురు కొయ్య (లంక), పసుపు, కుంకుమలతో తల్లుల ప్రతిమలను ఏర్పాటు చేసి కొలిచారు. సమ్మక్క తల్లియో హబ్బియ్యో అంటూ శివసత్తుల పూనకాలతో
మేడారం మార్మోగిపోయంది. కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారు తల్లుల దర్శనం కోసం వచ్చిన భక్త జనంలో అణువనువునా భక్తి భావం ఉప్పొంగింది. ఏ భక్తుడిని.. భక్తురాలిని కదలించినా తమ కుటుంబాలు ఆ తల్లుల దీవెనలతో చల్లగా ఉన్నాయనే భావన భక్తుల్లో కనిపించింది. పస్రా నుండి మొదలుకొని ప్రాజెక్ట్‌నగర్, కొత్తూరు, నార్లాపూర్, వెంగలాపూర్, కాల్వపల్లి, కనె్నపల్లి, ఊరట్టం, ఎలుబాక, మేడారం వరకు భక్తులతో కిక్కిరిసిపోయాయి. ఎటుచూసినా మేడారం తరలివెళ్లే భక్తుల వాహనాలే కనిపించాయి. దీంతో బుధవారం మేడారం చుట్టూ పరిసరాల్లోని చెట్లు, చేమల మధ్య, జనసంద్రంగా మారింది. మేడారం నలువైపులా 10 కిలోమీటర్ల మేర భక్తులతో నిండి భక్త్భివం అణువణువునా ఉప్పొంగిపోయంది. పిల్లా, పాపలతో సుదూర ప్రాంతాల నుండి తల్లుల దర్శనం కోసం కుటుంబ సమేతంగా తరలివచ్చిన భక్తులు అమ్మల ఆగమనం కోసం ఎదురుచూసిన క్షణాలను మదిలో పదిలం చేసుకొని బుధవారం సారలమ్మ ఆగమనంతో పులకించిపోయారు. ముందస్తు మొక్కులకు సిద్ధమైన భక్తులు సమ్మక్క రాకకు ముందే సారలమ్మ తల్లిని దర్శించుకోవడానికి తరించిపోయారు. మరికొంతమంది భక్తులు సారలమ్మ తల్లికి మొక్కులు చెల్లించి తిరుగు పయనానికి సిద్ధమయ్యారు.

*చిత్రం... కనె్నపల్లి నుండి సారలమ్మను మేడారం తోడ్కొని వస్తున్న దృశ్యం