తెలంగాణ

గద్దెను అధిష్ఠించిన సారలమ్మ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేడారం: మేడారం మహాఘట్టం ప్రారంభమైంది. కనె్నపల్లి నుండి బుధవారం రాత్రి మేడారం గద్దెకు సారలమ్మ తల్లిని చేర్చడంతో జాతరలో తొలి ఘట్టం ప్రారంభమైంది. బుధవారం సాయంత్రం కనె్నపల్లి ఆలయంలో గిరిజన సంప్రదాయ పద్ధతిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధాన పూజారి కాక సారయ్య అత్యంత నిష్టతో బుధవారం ఉదయం నుండి అడియారలు శుభ్రం చేసి ఆలయాన్ని శుభ్రంగా అలికి, కాక వంశీయులు, ఆడబిడ్డలు అందమైన ముగ్గులతో ఆలయ ప్రాంగణాన్ని తీర్చిదిద్దారు. సాయంత్రం 5-50 గంటలకు ప్రధాన పూజారి కాక సారయ్య ఇంటి నుండి చీరె, సారెతో సారలమ్మ గుడికి చేరుకొని సంప్రదాయ ప్రకారం సారలమ్మను మేడారం పంపించేందుకు సన్నాహాలు చేశారు. ఐటీడీఏ ఏటూరునాగారం పీఓ చక్రధరర్‌రావు, ఓఎస్డీ సురేష్ కుమార్, ములుగు ఎమ్మెల్యే సీతక్క, ఆలయ పునరుద్ధరణ కమిటీ చెర్మన్ ఆలం రామ్మూర్తి సారలమ్మ ఆలయానికి చేరుకొని సారలమ్మ తల్లిని సాయంత్రం 6-34 గంటలకు మేడారం తోడ్కొని వచ్చారు. మార్గమధ్యంలో సారలమ్మ సోదరుడైన జంపన్నను పలకరించి సారలమ్మ తల్లి మేడారం పయనమయ్యింది. కనె్నపల్లి నుండి మేడారం వరకు 4 కిలోమీటర్ల దూరం ఉన్న మార్గంలో దారిపొడవునా భక్తులు సారలమ్మకు జయజయ ధ్వానాలతో స్వాగతం పలికారు. కనె్నపల్లి నుండి మేడారం వరకు విద్యుత్‌దీప కాంతుల నడుమ సారలమ్మ తల్లి రాత్రి ----- గంటలకు గద్దెకు చేరింది. ఈ సందర్భంగా పూజారులు సారలమ్మ తల్లికి స్వాగతం పలికారు. అనంతరం పూజారులు పూజలు నిర్వహించి సారలమ్మ తల్లిని గద్దెపై ప్రతిష్ఠించడంతో తొలి ఘట్టం మొదలైంది. సారలమ్మ గద్దెకు చేరుకోగానే భక్తులు పెద్ద ఎత్తున మొక్కులు సమర్పించారు. ఈ సందర్భంగా మేడారం జనసంద్రంగా మారింది. అమ్మవారి దర్శనం కోసం భక్తులు పోటీ పడ్డారు.