తెలంగాణ

ఫార్మాసిటీ భూ అక్రమాలపై విచారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 5: ఫార్మా సిటీ భూ ఆక్రమణలపై విచారణ జరిపించాలని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేంద్రాన్ని డిమాండ్ చేశారు. బుధవారం ఆయన కేంద్రవాణిజ్య శాఖ మంత్రి పీయూష్‌గోయల్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ అంశంపై కాంగ్రెస్ ఎంపీ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ఫార్మా సిటీలో అవకతవకలు జరిగాయని ఎంపీ కోమటిరెడ్డి అన్నారు. వేల ఎకరాల భూ దందా చేస్తున్నారన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే ఫార్మా సిటీని నిర్మించారన్నారు. పేద రైతుల నుంచి బలవంతంగా భూసేకరణ చేస్తున్నారన్నారు. ఎకరా భూమి రూ.8లక్షలకు రైతుల వద్ద కొని కోటిన్నరకు ఫార్మా కంపెనీలకు అమ్ముతున్నారన్నారు. 19వేల ఎకరాలు అవసరం లేదన్నారు. ఫార్మాతో కాలుష్యం ఖాయమన్నారు. చెరువులు, భూగర్భ జలాలు కాలుష్యమయమవుతాయన్నారు. ప్రకృతి సర్వనాశనం అయితే అణగారిన వర్గాలకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. తక్షణం ఫార్మాసిటీని అడ్డుకోవాలన్నారు. భూ దందా మీద సమగ్ర విచారణ జరిపించాలన్నారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు సాగుతున్నాయని, ఫార్మా సిటీ అనుమతులు రద్దు చేసి ప్రజలకు న్యాయం చేయాలన్నారు.
రైతులను గందరగోళంలో పడేస్తున్న కేసీఆర్
సీఎం కేసీఆర్ మరోసారి రైతులను గందరగోళంలో పడేస్తున్నారని పీసీసీ మాజీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. బుధవారం ఆయన ఇక్కడ విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ సహకార ఎన్నికల్లో హడావుడిగా ముందస్తు సమాచారం లేకుండా ఎన్నికల ప్రకటన చేశారన్నారు. సహకార ఎన్నికల్లో ఓటర్ల చేర్పులు, మార్పులకు అవకాశం లేకుండా చేశారన్నారు. కేసీఆర్ తన నిరంకుశ పాలనను ఈ ఎన్నికల్లో మరోసారి నిరూపించుకున్నారన్నారు. కేసీఆర్ రాజరికపు పోకడను అవలంభిస్తున్నారన్నారు. సహకార ఎన్నికల్లో రైతుల ఓటుహక్కును తీసేయడం వారి హక్కులను హరించడమేనన్నారు. రెండోసారి అధికారంలోకి వచ్చి 14 నెలలు అవుతున్నా, రైతు రుణమాఫీ ఇచ్చిన హామీ ఎటు బోయిందన్నారు. కేసీఆర్ ఇచ్చిన హామీ నెరవేర్చక , పెరిగిన వడ్డీతో బకాయిలు పెరిగాయన్నారు. 14లక్షల మంది ఓట్లు తొలగించడం ఏ మేరకు సబబు అన్నారు. కేసీఆర్ పాలనలో రైతులకు ఒరింగిదేమీ లేదన్నారు. ఏ మొహం పెట్టుకున సహకార ఎన్నికల్లో ఓట్లు అడుగుతారన్నారు. గొర్రెల పెంపకందారుల నుంచి రూ.390 కోట్లు, చేపల పెంపకం దారుల నుంచి రూ.1040 కోట్ల అడ్వాన్సుగా తీసుకున్న ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి సహకారం ఇవ్వలేదన్నారు. పంటల బీమా అమలులో ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రైతులు అనేక రకాలుగా నష్టపోయారన్నారు. పంటలకు గిట్టుబాటు ధరలు లేవన్నారు. మార్క్‌ఫెడ్‌ను మూసేశారన్నారు.