తెలంగాణ

బీజేపీతో దేశానికి ముప్పు: సీపీఐ నేత చాడ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 5: కేంద్ర ప్రభుత్వంతో దేశానికి ముప్పు, ప్రమాదం పొంచి ఉందని ప్రజాస్వామ్యానికే తిలోదకాలు ఇచ్చే పరిస్థితిని కేంద్రం తీసుకువస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి పేర్కొన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ చూస్తే పూర్తిగా కార్పొరేట్ అనుకూలంగా ఉందని, పేదలకు తీవ్ర వ్యతిరేకంగా ఉందని చెప్పారు. బుధవారం నాడు ఆయన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పాత్రికేయులతో మాట్లాడారు.
ప్రైవేటీ రంగం మోజులో పడి ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతోందని ఆయన ఆరోపించారు. ఆర్ధిక మాంద్యం ప్రభావం తెలంగాణపై పడినా, తెలంగాణ ఆర్ధికంగా నిలదొక్కుకుందని కేటీఆర్ ప్రగల్బాలు పలుకుతున్నారని, 30వేల కోట్ల రూపాయిల బిల్లులు పెండింగ్‌లో పడిన విషయం గుర్తులేదా అని ఆయన ప్రశ్నించారు.
రానున్న రోజుల్లో సీపీఐని తెలంగాణలో మరింత పటిష్టం చేస్తామని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా సీపీఐ పటిష్టానికి ,సిద్ధాంతాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు మరింత చొరవ తీసుకుంటామని అన్నారు. సిద్ధాంతం, నిర్మాణం కలయికగా ఈ నెల 22 నుండి 24 వరకూ మంచిర్యాలలో రాష్ట్ర నిర్మాణ సభలు నిర్వహిస్తున్నామని అన్నారు. 22వ తేదీ మధ్యాహ్నం ఈ సభలను సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ రాజా ప్రారంభిస్తారని ఆయన పేర్కొన్నారు. 20 జిల్లాల్లో సీపీఐ నిర్మాణ సభలు పూర్తయ్యాయని, మరో 13 జిల్లాల్లో త్వరలో పూర్తిచేస్తామని పేర్కొన్నారు. దేశంలో పరిస్థితి గందరగోళంగా, అగమ్యగోచరంగా ఉందని, రాష్ట్రంలోనూ అదే పరిస్థితి నెలకొందని తెలిపారు. సీపీఐ జాతీయ కౌన్సిల్ ప్రత్యేక సమావేశాలు కొల్‌కటాలో జరిగాయని, అక్కడ నేక నిర్ణయాలు తీసుకున్నామని అన్నారు.
పార్టీ నిర్మాణం, ఉద్యమాలు, పోరాటాలు పటిష్టం చేయాలని నిర్ణయించామన్నారు. దేశవ్యాప్తంగా బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగ ఉల్లంఘనలు కొనసాగుతున్నాయని జాతీయ సభల్లో అభిప్రాయపడినట్టు పేర్కొన్నారు. ప్రజావ్యతిరేక, రాజ్యాంగ వ్యతిరేక చర్యలు అనేకం దేశవ్యాప్తంగా కొనసాగుతున్నాయని, ఇటీవల కేంద్రం కార్పొరేట్ అనుకూల, పేదల వ్యతిరేక బడ్జెట్‌ను ప్రవేశపెట్టిందని అన్నారు. కేంద్ర బడ్జెట్‌ను నిరసిస్తూ, ఈ నెల 12 నుండి 18 వరకూ వారం రోజుల పాటు దేశవ్యాప్తంగా ఉద్యమించాలని నిర్ణయించామని చెప్పారు. ఆర్ధిక తిరోగమన విధానాలను తిరస్కరిస్తూ ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తామని, అన్ని వామపక్ష పార్టీలు ఈ ఆందోళన కార్యక్రమంలో పాల్గొంటాయని తెలిపారు. ఫిబ్రవరి 21న మ్యానిఫెస్ట్‌డే, సైద్ధాంతిక దినోత్సవాన్ని నిర్వహిస్తామని, ఈ కార్యక్రమంలో మిగిలిన వామపక్షాలను కూడా కలుపుకుంటాం. కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యితిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు మరో రాజకీయ పోరాటాన్ని మార్చి 23 వరకూ చేపడతామని, ఇందులో జమ్మూకాశ్మీర్ విభజన, హిందూత్వ అజెండా, సీఏఏ, ఎన్‌పీఆర్, ఎన్‌సీఆర్ అంశాలతో పాటు కేంద్ర ప్రభుత్వ ఫాసిస్టు చర్యలను, కుట్రలూ, కుతంత్రాలను బహిర్గతం చేసేలా ఈ రాజకీయ పోరాటాలను నిర్వహించి ప్రజలను చైతన్య పరుస్తామని అన్నారు. ఫిబ్రవరి 22న నేవీ రివోల్ట్ దినోత్సవాన్ని కూడా నిర్వహిస్తామని ఆయన చెప్పారు.