తెలంగాణ

దేవుళ్లనూ కేసీఆర్ మోసగిస్తున్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 5: ఆసియాలో అతిపెద్ద గిరిజన జాతర , ఆదివాసీల పండుగ, 8 రాష్ట్రాల ప్రజలు కొలుచుకునే మేడారం జాతరకు అవసరమైన ఏర్పాట్లు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్ ఆరోపించారు. భవ్యమైన రామమందిర నిర్మాణంపై ప్రధాని నరేంద్రమోదీ కీలకమైన ప్రకటన చేశారని, రామమందిర నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వం తన వైఖరి ఏమిటో స్పష్టం చేయాలని లక్ష్మణ్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇతర రాష్ట్రాల నుండి వచ్చే గిరిజనులకు స్నానాలు చేసుకునేందుకు, నివాసం ఉండేందుకు వౌలిక సదుపాయాలను కల్పించడంలో ఘోరంగా విఫలమైందని వివరించారు. సీఎం కేసీఆర్ ప్రతి సారీ హామీలు ఇవ్వడం మభ్యపెట్టడం అలవాటు చేసుకున్నారని దేవుళ్లనూ, దేవతలనూ ఆయన మోసగిస్తున్నారని అన్నారు. సీఎం మందిరాలకు, ఆలయాలకు ఎక్కడకు వెళ్లినా వంద కోట్ల కేటాయింపు అంటారని, వెచ్చించేదీ ఖర్చు చేసేదీ శూన్యమని ఎద్దేవా చేశారు. 200 కోట్లు ఖర్చు చేసి దక్షిణాది కుంభమేళా మాదిరి నిర్వహిస్తామని చెప్పిన సీఎం మొన్నటి బడ్జెట్‌లో మేడారం కోసం 98 కోట్లు ఇచ్చారని, వాటిని ఖర్చుచేసే అవకాశం లేకుండా నెల రోజుల వ్యవధిలో నలుగురు కలెక్టర్లను మార్చేశారని ఆరోపించారు. అధికార పార్టీ వ్యక్తులకు నామినేషన్ పద్ధతిపై పనులు అప్పగించడం లేదని కలెక్టర్లను మార్చేసారని తెలిసిందని, జాతరను, దేవుళ్లను కూడా టీఆర్‌ఎస్ పార్టీ వదలడం లేదని పేర్కొన్నారు. జంపన్నవాగుపై చెక్‌డ్యామ్ నిర్మించి భక్తులు స్నానాలు చేసేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తామని సీఎం చెప్పారని, అవసరమైతే తాను అక్కడే పడుకుంటానని చెప్పారని, అన్నీ మరిచిపోయారని అన్నారు. కాలుష్యం అదుపు చేసేందుకు ఎలాంటి చర్యలూ చేపట్టలేదని చెప్పారు. ప్రధాని నరేంద్రమోదీ భవ్యమైన రామమందిర నిర్మాణానికి చర్యలు చేపట్టారని, ట్రస్టు ఏర్పాటుకు చర్యలు తీసుకున్నట్టు ప్రధాని ప్రకటించారని క్యాబినెట్‌లో కూడా ఇందుకు సంబంధించిన నిర్మాణం తీసుకున్నారని పేర్కొన్నారు. ప్రధానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నట్టు లక్ష్మణ్ చెప్పారు.
పార్టీ పరంగా స్వచ్ఛందంగా పది అంబులెన్స్‌లను బీజేపీ మేడారం జాతరకు పంపుతోందని, వైద్యుల బృందం భక్తులకు సేవలు అందిస్తారని లక్ష్మణ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్‌రెడ్డి, కార్యదర్శి కుమార్, అధికార ప్రతినిధి అల్జాపూర్ శ్రీనివాస్, డాక్టర్ ప్రకాష్, సునీల్ పవార్, డాక్టర్ సురేందర్ తదితరులు పాల్గొన్నారు.