తెలంగాణ

విత్తనాభివృద్ధిలో సహకారం కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 5: విత్తనాభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం కొత్త పుంతలు తొక్కుతోందని, దేశ విదేశాలకు నాణ్యమైన విత్తనాలను ఎగుమతి చేస్తోందని, దీన్ని మరింత సమర్థతగా ముందుకు తీసుకువెళ్లేందుకు సహకరించాలంటూ ఐక్య రాజ్య సమితికి చెందిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్‌ఏఓ) అధికారులను రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కే. కేశవులు కోరారు. రోమ్‌లో ఎఫ్‌ఏఓ అడిషనల్ డైరెక్టర్ జనరల్ బూకర్ తిజానీ తదితర అధికారులతో ఆయన బుధవారం చర్చలు జరిపారు. విత్తన రంగంలో ఇప్పటికే తెలంగాణ రాష్ట్రానికి అంతర్జాతీయంగా గుర్తింపు వచ్చిందని గుర్తు చేశారు. 400 పైగా విత్తన శుద్ధి కేంద్రాలు తెలంగాణలో నడుస్తున్నాయని, రైతులు శ్రద్దగా విత్తనాలను తయారు చేసేందుకు ఆధునిక విధానాలను అమలు చేస్తున్నారని గుర్తు చేశారు. నాణ్యమైన విత్తనాన్ని రూపొందించేందుకు ప్రభుత్వ పరంగా అవసరమైన చర్యలు తీసుకున్నామని, రైతులకు ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు ఇస్తున్నామని గుర్తు చేశారు. అంతర్జాతీయంగా తెలంగాణ విత్తనాలకు మంచి స్పందన ఉందని, ఎఫ్‌ఏఓ సహకారం కూడా తీసుకుంటామని కేశవులు తెలిపారు.