తెలంగాణ

8న లోక్ అదాలత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 5: జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాలకు అనుగుణంగా జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 8వ తేదీన నిర్వహించనున్నట్టు తెలంగాణ న్యాయ సేవాధికార సంస్థ సభ్య కార్యదర్శి జీవీ సుబ్రహ్మణ్యం తెలిపారు. తెలంగాణ లోని అన్ని జిల్లా, మండల స్థాయిలో లోక్ అదాలత్‌లను నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ ఏడాది జరుగుతున్న జాతీయ లోక్ అదాలత్‌లో ఇది మొదటిదని అన్నారు. గత ఏడాది సాధారణ లోక్ అదాలత్‌లను నిర్వహించామని అందులో 8071 పెండింగ్ కేసులు, 5651 ప్రీ లిటిగేషన్ కేసులను పరిష్కరించినట్టు చెప్పారు. ఈ పరిష్కారంలో భాగంగా వంద కోట్ల 40 లక్షల 78వేల 690 రూపాయిలు పరిహారాన్ని బాధితులకు అందిడమైందని అన్నారు. గత ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 3081 న్యాయ సాక్షరతా శిబిరాలను నిర్వహించామని, వాటి ద్వారా 14,869 మంది లబ్దిదారులకు లబ్ది చేకూరిందని చెప్పారు. జాతీయ లోక్ అదాలత్‌లను ఒక బృహత్ కార్యక్రమంగా తీసుకుని కేసులను పరిష్కరిస్తున్నామని అన్నారు. గత ఏడాది నాలుగు జాతీయ లోక్ అదాలత్‌లు నిర్వహించి 1,14,026 కేసులను పరిష్కరించామని అన్నారు. ఈ నాలుగు జాతీయ లోక్ అదాలత్‌లలో మొత్తం 308 కోట్ల 12 లక్షల రూపాయిలను పరిహారంగా చెల్లించడం జరిగిందని పేర్కొన్నారు. జాతీయ లోక్ అదాలత్‌లలో ఎక్కువ మొత్తంలో రాజీ పడదగ్గ నేరాల సంఖ్యను తగ్గించగలుగుతామని వివరించారు. అదే స్ఫూర్తితో వచ్చే నెల 8వ తేదీన నిర్వహించే జాతీయ లోక్ అదాలత్‌లో కక్షిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొని న్యాయ సహాయం పొంది, వారి వారి కేసులు పరిష్కరించుకుని శాంతియుతమైన జీవనాన్ని సాగించాలని కాంక్షిస్తున్నట్టు ఆయన తెలిపారు.